వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు బ్రహ్మ విద్య లాంటిదని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. సిఎం జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి బాబును జైల్లో ఉంచారని లోకేష్ ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఇన్నాళ్ళూ ఎవరిని ఎవర్ని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వేలారని ప్రశ్నించారు. తాడేపల్లిలోవి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని… లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
- ఎవరి కాళ్లు పట్టుకుని మేనేజ్ చేద్దామని ఢిల్లీ వీధుల్లో తిరిగావ్ లోకేశ్?
- తల్లి గారిని, శ్రీమతి గారిని జైలు బయట వదిలేసి పాతిక రోజులు ఢిల్లీలో గడిపి వచ్చిన ఉత్తరకుమారుడు లోకేశ్ మంచి సెంటిమెంట్ సినిమా చూపించాడు.
- ఈ రోజు జైళ్లో చంద్రబాబును ఓదార్చి బయటకొస్తున్నట్లుగా సినిమా చూపించారు.
- ఈ భారతదేశంలోనే అత్యంత నీతివంతుడు, నిఖార్సయిన నారా చంద్రబాబును రాజకీయ కక్షతో వ్యవస్థలను మేనేజ్ చేసి జగన్ గారు జైళ్లో పెట్టించారని ముగ్గురు కలిసి ఫ్యామిలీ సెంటిమెంట్ పండించాలని చూశారు.
- కోర్టులను, సీఐడీ వ్యవస్థను మేనేజ్ చేసి నీతివంతుడైన తన తండ్రిని జైళ్లోకి జగన్ గారు తోశారు అంటున్నారు.
- ఆయన్ను ఒకటే ప్రశ్నిస్తున్నా…మీ లెక్కలో అతినీతివంతుడైన మీ నాన్న గారు జైల్లోకి వెళ్లిన 24 గంటల నుంచి మీరెక్కడున్నారు.
- ఢిల్లీ నుంచి రోజుకి రెండు, రెండున్న కోట్లు తీసుకునే ప్లీడర్లు బెజవాడ బజార్లలో తిరుగుతున్నారు.
- ఏసీబీ కోర్టులో చంద్రబాబును విడిపించమని ఇక్కడ కేసులు వేస్తూ తిరుగుతున్నారు.
- వాళ్లంతా బెజవాడ బజార్లలో తిరుగుతుంటే మీ అమ్మను, శ్రీమతిని రాజమండ్రి జైలు బయట రోడ్డుమీద వదిలేసి ఈ పాతిక రోజులు ఢిల్లీలో ఏం చేద్దామని వెళ్లావు..?
- మీ నాన్న నేర్పిన విద్య ఉంది కదా…ఎవర్ని మేనేజ్ చేద్దామని వెళ్లావు..?
- మీ తండ్రి వద్ద నుంచి మేనేజ్ చేయడం మీకు బ్రహ్మ విద్యే కదా.
- ప్లీడర్లంతా ఇక్కడుంటే..బెయిల్ వాదనలన్నీ బెజవాడ ఏసీబీ కోర్టులో జరుగుతుంటే ఢిల్లీలో ఏం కాలక్షేపం చేస్తున్నావు లోకేశ్?
- ఎవర్ని మేనేజ్ చేద్దామని..ఎవరి కాళ్లు పట్టుకుందామని, ఎవరి చేతులు పట్టుకుందామని పాతిక రోజుల నుంచి ఊరు వదిలేసి ఢిల్లీలో ఎందుకు తిరుగుతున్నావ్..?
- ఇది కదా దిక్కుమాలిన మేనేజ్‌మెంట్ అంటే..లాబీయింగ్ అంటే ఇది కదా..
- వ్యవస్థలను మేనేజ్ చేసే ప్రయత్నం అంటే తల్లిని, భార్యను రోడ్లమీద వదిలేసి ఢిల్లీలో తిరుగుతూ ఇతను మేనేజ్‌మెంట్ల గురించి మాట్లాడతున్నాడు..సిగ్గుపడాలి.