Sunday, November 24, 2024
HomeTrending NewsNara Lokesh: అమిత్ షా తో రాజకీయ చర్చలు జరపలేదు

Nara Lokesh: అమిత్ షా తో రాజకీయ చర్చలు జరపలేదు

చంద్రబాబుపై పెట్టినవి అన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులు మాత్రమేనని, ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు చెప్పానని  తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. నిన్న సిఐడి విచారణలో ఉన్న సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి అమిత్ షా రమ్మన్నారని చెప్పారని లోకేష్ తెలిపారు. ఢిల్లీలో లోకేష్ మీడియాతో జరిపిన చిట్ చాట్ లోని ముఖ్యాంశాలు

  • పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసులే అని అమిత్ షాకు చెప్పాను
  • చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బందిపడుతున్నట్లు చెప్పాను
  • చంద్రబాబు భద్రత పరంగా ఉన్న ఆందోళన కూడా చెప్పాను
  • సీఐడీ ఎందుకు పిలిచింది.. ఎన్ని కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు
  • బీజేపీ పేరు చెప్పి కక్ష సాధిస్తున్నారని అమిత్ షా అన్నారు
  • అమిత్ షా వద్ద ఎలాంటి రాజకీయ విషయాలు చర్చకు రాలేదు
  • బీజేపీనే చేయిస్తోందని ఒక ఎంపీ, మంత్రి నేరుగా అన్నట్లు చెప్పాను
  • బీజేపీ పాత్ర ఉందని నేను అనుకోవట్లేదు
  • బీజేపీ నేతల మౌనంతో ఆరోపణలు వచ్చాయనుకుంటున్నా
  • నిజం వైపు ఉండాలని అమిత్ షాను కోరాను
  • టీడీపీ ఎంపీలు ప్రధాని, హోంమంత్రికి లేఖలు రాశారు
  • రాష్ట్రం నుంచి అమిత్ షా సమాచారం తీసుకున్నట్లు తెలిసింది
  • క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది
  • అక్రమ కేసుపై వైసీపీ క్యాడర్ లోనే అనుమానం ఉంది
  • 10 రోజులుగా కేసు విషయమై వైసీపీ మాట్లాడట్లేదు
  • స్కిల్ కేసు వెనుక ఏదో జరుగుతోంది
  • నా తల్లి ఐటీ రిటర్న్ లు సీఐడీ చేతికి ఎలా వచ్చాయి?
  • నా తల్లి ఐటీ రిటర్న్ లపై సీబీడీటీకి ఫిర్యాదు చేస్తా
  • ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూరంలోనే ఉన్నాం
  • దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల నేతలను కలిశా
  • మేం సుప్రీంలో సవాల్ చేసిన 17ఏ అంశం చాలా కీలకం
  • 17ఏ పరిగణనలోకి తీసుకోకుంటే చాలామంది ఇబ్బంది పడతారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్