Sunday, September 22, 2024
HomeTrending NewsDaggubati: బాబు భద్రత బాధ్యత ప్రభుత్వానిదే

Daggubati: బాబు భద్రత బాధ్యత ప్రభుత్వానిదే

రాష్టంలో మద్యం తయారీదారుల పేర్లను సాయంత్రంలోగా బైటపెట్టే దమ్మూ, ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సవాల్ చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం కంపెనీ యజమానులు ఎవరు, ఇప్పుడు ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో ఉన్న వారిని బెదిరించి తమ పార్టీ వారికి కాంట్రాక్టులు ఇప్పించుకున్నారని ఆరోపించారు. రాష్టంలో 23.5 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో తేలిందని, అంటే కోటి 29 లక్షల మంది ఉంటారని, క్రిసిల్ లెక్కల ప్రకారం కోటి 80 లక్షల మంది వరకూ ఉన్నారని… కానీ తక్కువలో తక్కువగా 80 లక్షల మంది మద్యం తాగుతున్నారని తాను చెబితే వాటిని కాకిలెక్కలంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పడం సరికాదని, కేవలం 40 లక్షలమంది మాత్రమే ఉన్నారని చెప్పడం ఏమిటని  ఆమె ప్రశ్నించారు. మద్యం విక్రయంలో ఎందుకు డిజిటల్ పేమెంట్ కు అనుమతించడం లేదని నిలదీశారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నాసిరకం మద్యం అమ్ముతున్నారని, తాము రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి మద్యం బాధితులను కలిశామని, గడచిన రెండేళ్లలో ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ బాధితుల సంఖ్య 25 శాతం పెరిగిందని వైద్యులు చెప్పారన్నారు.

ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి నుంచి కడిగిన ముత్యంలా బైటకు రావాలంటే సిబిఐ విచారణ చేయించాలని సిఎం జగన్ కు ఆమె సూచించారు. ఏదైనా మాట్లాడితే ఆమె బిజెపి అధ్యక్షురాలా మరో పార్టీకా అని తనను ప్రశ్నించడం కాదని… అవినీతిపై మాట్లాడాలని కోరారు.

చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడని, ఆయనకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని దగ్గుబాటి స్పష్టం చేశారు. ఆయనకు సరైన వైద్య సౌకర్యాలు కల్పించాల్సింది కూడా ప్రభుత్వమేనన్నారు. బాబు అరెస్టు వెనుక బిజెపి హస్తం లేదని, అరెస్టు చేసిన తీరు సరిగా లేదని పేర్కొన్నారు. అవినీతి జరిగిందా లేదా అనేది కోర్టు తేలుస్తుందని చెప్పారు.

లోకేష్ కు అమిత్ షా అపాయింట్ మెంట్ ఎవరు ఇప్పించారన్నది ముఖ్యం దని, ఈ మీటింగ్ సమయంలో తాము అక్కడ ఉన్నామని, బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారని, ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఏ బెంచ్ లో విచారణ జరుగుతుందో వివరాలు తీసుకున్నారని ఆమె వెల్లడించారు.  తెలంగాణ ఎన్నికల కోసమే లోకేష్ కు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇచ్చారన్న ప్రశ్నకు బదిలిస్తూ ‘నాలుకకు నరం లేదుగా’ అంటూ వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్