Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్Chandrababu: బాబుకు దక్కేనా ఊరట?

Chandrababu: బాబుకు దక్కేనా ఊరట?

స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకి ఊరట లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సుప్రీం కోర్టులో గత మూడు వారాలుగా జరిగిన వాదనల సరళిని పరిశీలిస్తే ఇదే అభిప్రాయం టిడిపి వర్గాలతో పాటు న్యాయ నిపుణుల్లో కనిపిస్తోంది.

చంద్రబాబుకు 17 (ఏ) చట్టం వర్తిస్తుందంటూ సీనియర్ లాయర్ హరీష్ సాల్వే ధర్మాసనం ఎదుట పదునైన వాదనలు వినిపించగలిగారు. దీనికి సంబంధించి గతంలో సర్వోన్నత న్యాయస్థానం వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను ఆయన ఉటంకించారు. ఒకవేళ నేరం జరిగి ఉన్నా కేసు నమోదు చేసిన తేదీ నాటికి ఉన్న చట్టాలే వర్తిస్తాయని పేర్కొన్నారు.

మరోవైపు ఏపీ సిఐడి తరఫున వాదించిన ముకుల్ రోహాత్గీ అవినీతి, కుంభకోణం చుట్టూనే విషయాన్ని తిప్పారు కానీ, 17 (ఏ)  పై సాల్వే చేసిన వాదనలను ధీటుగా తిప్పికొట్టలేకలేకపోయారని అనిపిస్తోంది. విచారణను కావాలని సాగదీశారని, వాయిదాలతో పొడిగించారని పలువురు భావిస్తున్నారు. అక్టోబర్ 17 మంగళవారం నాటికి వాదనలు పూర్తయినట్లు ధర్మాసనం ప్రకటించినా ఇంకా ఏవైనా వాదనలు వినిపించాలంటే రాతపూర్వకంగా శుక్రవారంలోపు సమర్పించాలని సూచించింది. శుక్రవారం నాడు తుది తీర్పు రావొచ్చని… ఒకవేళ రాతపూర్వకంగా సమర్పించిన వాదనలు పరిశీలించడం లేట్ అయితే కొంత వాయిదా పడొచ్చని అంటున్నారు. శుక్రవారం తర్వాతా దసరా సెలవులు ఉండడంతో ఆ తర్వాతే తీర్పు ఉంటుందని భావిస్తున్నారు. మరికొంత మంది మాత్రం కోర్టు సెలవుల్లో ఉన్నా బెంచ్ అనుకుంటే తీర్పును వెలువరించడంలో ఎలాంటి అడ్డంకులూ లేవని అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్