Friday, November 22, 2024
Homeసినిమా'సలార్' కథ ఇదేనా..?

‘సలార్’ కథ ఇదేనా..?

ప్రభాస్ నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ‘సలార్’. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి అసలు కథ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఈ సినిమా కథ గురించి ఎలాంటి క్లూ బయటకు రాలేదు. డిసెంబర్ 22న సలార్ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 23న ట్రైలర్ రిలీజ్ కానుందని వార్తలు వచ్చాయి కానీ.. ట్రైలర్ రిలీజ్ పై ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు.

ఇంకా సినిమా రిలీజ్ కి టైమ్ ఉండడం వలన నవంబర్ నెలాఖరున ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ మూవీ స్టోరీ అంటూ ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే.. సలార్, దేవా అనే తండ్రీకొడుకుల పాత్రల్లో ప్రభాస్ నటించాడట. రాజమన్నార్ గా జగపతిబాబు నటిస్తే.. ఆతని కొడుకుగా వరదరాజ మన్నార్ గా పృథ్వీరాజ్ సుకుమార్ కనిపిస్తారట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. దేవా, వరదరాజ్ మన్నార్ ప్రాణస్నేహితులట. అయితే.. సలార్ సామ్రాజ్యానికి తూట్లు పడేందుకు కారణమైన గ్యాంగ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చే్స్తుంటాడట దేవా.

అయితే.. ఇలా తెలుసుకుంటున్న క్రమంలో ఆ గ్యాంగ్ నాయకుడు తన ఫ్రెండే అని తెలిసి షాక్ అవుతాడట దేవా. ఇక అక్కడ నుంచి దేవా విశ్వరూపం చూపించడమే స్టోరీలోని మెయిన్ పాయింట్ అని టాక్ వినిపిస్తోంది. అయితే.. బాహుబలి సినిమా వలే సలార్ సెకండ్ పార్ట్ లో వస్తాడట. తండ్రి పాత్ర చనిపోయినట్టు కాకుండా ఇద్దరూ ప్రభాస్ లను ఒకేసారి చూసే ఛాన్స్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ప్రచారంలో ఉన్న స్టోరీ నిజమో కాదో తెలియదు కానీ.. ఇదే కథ అయితే మాత్రం నెక్ట్స్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు సినీజనాలు. ట్రైలర్ రిలీజ్ అయితే.. స్టోరీ పై క్లారిటీ వస్తుంది. మరి.. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్