Saturday, November 23, 2024
HomeTrending NewsCM Jagan: ఆరు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం

CM Jagan: ఆరు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం

పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోందని, కలెక్టర్లు కూడా ఈవిషయంపై ప్రత్యేక  శ్రద్ధ వహించి పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమిట్‌లో 386 ఎంఓయూలు చేసుకున్నామని, వీటిద్వారా  13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు… 6 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నెలకొల్పిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు  తాడేపల్లిలోని క్యాంపు  కార్యాలయం నుంచి శంఖుఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రాష్టంలో పారిశ్రామిక ప్రగతిపై ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేశారు.

సిఎం జగన్ మాట్లాడిన ముఖ్యాంశాలు

  • గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలపై ప్రతినెలా సమీక్ష చేస్తూ పురోగతికోసం చర్యలు తీసుకున్నాం
  • 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తులు ప్రారంభించాయి
  • 94 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రారంభదశలో ఉన్నాయి
  • సీఎస్‌ గారి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం
  • నెలకు కనీసంగా రెండు సమీక్షా సమావేశాలు వీటిపై జరుగుతున్నాయి.  వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయి
  • ప్రతి అడుగులోనూ కలెక్టర్లు చేయిపట్టి నడిపించాలి. ఈనాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం
  • 69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేలమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాం
  • ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో ఎప్పుడూ చూడని అడుగులు వేశాం
  • కోవిడ్‌ సమయంలోకూడా కుప్పకూలిపోకుండా వారికి చేయూత నిచ్చాం
  • 1.88 లక్షల ఎంఎస్‌ఎంఈలు కొత్తగా వచ్చాయి. 12.62 లక్షల ఉద్యోగాలు వీటిద్వారా వచ్చాయి
  • మనం అందరం కలిసికట్టుగా ఈ బాధ్యతను తీసుకున్నాం కాబట్టే ఇది సాకారం అయ్యింది
  • పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి కేవలం మనం ఫోన్‌కాల్‌దూరంలో ఉన్నాం
  • వారిపట్ల సానుకూలతతో ఇదే పద్ధతిలో ఉండాలి, దేవుడి దయతో మనం ఇవాళ మంచి కార్యక్రమాన్ని చేశాం
  • 9 ప్రాజెక్టుల్లో 3 ప్రారంభిస్తున్నాం, మిగతా ఆరు పనులు ప్రారంభిస్తున్నాం
  • దాదాపు 1100 కోట్ల పెట్టుబడి, 21 వేలమందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి
  • పత్తికొండకు నేను వెళ్లినప్పుడు అక్కడ పరిశ్రమ ఏర్పాటుచేస్తామని చెప్పాం
  • ఈ మేరకు ఇవాళ ఫుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్‌కు శంకుస్థాపనచేస్తున్నాం, అధికారులు మంచి కృషిచేశారు:
    అంతే వేగంగా అడుగులు ముందుకేయాలి
  • పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నవారందరికీ కూడా ఆల్‌ ది బెస్ట్‌
  • ఎంఎస్‌ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్‌లు అందించనున్నాం
RELATED ARTICLES

Most Popular

న్యూస్