Sunday, January 19, 2025
Homeసినిమాఅందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్న 'దేవర' 

అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్న ‘దేవర’ 

కంటెంట్ వైపు నుంచి .. ఎన్టీఆర్ లుక్ వైపు నుంచి .. బడ్జెట్ వైపు నుంచి ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పాత్ర వైపు నుంచే ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. అది కూడా యాక్షన్ సీన్ కి సంబంధించినది కావడంతో ఫాస్టుగా కనెక్ట్ అయింది.

ఈ గ్లింప్స్ ను వివిధ భాషల్లో రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేసిన అన్ని భాషల్లోను కలుపుకుని 24 గంటల్లో 57 మిలియన్స్ ప్లస్ వ్యూస్ ను రాబట్టుకుంది. దీనిని బట్టి ఈ సినిమాపై ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారన్నది అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమా ఓ విజువల్ వండర్ అనీ .. ఇలాంటి సినిమాలు తెలుగులో ఇంతకుముందు రాలేదని కల్యాణ్ రామ్ ఆ మధ్య చెప్పాడు. అందుకు తగినట్టుగానే గ్లింప్స్ లోని విజువల్స్ కనిపించాయి.

వెన్నెల రాత్రుల్లో సముద్రంలో దొంగల దాడి .. తీరంలో జరిగే ఫైట్ కి సంబంధించిన సన్నివేశాలు చాలా సహజంగా కనిపించాయి. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. ఆయన మేనరిజం డిఫరెంట్ గా ఉంటుందనీ, చాలా రోజుల పాటు ఈ పాత్ర గుర్తుండిపోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాతోనే  జాన్వీ కపూర్ పరిచయం కానుండటం కూడా ప్రత్యేకమైన ఆకర్షణగా మారింది. ఏప్రిల్ 5వ తేదీన రానున్న ఈ సినిమా, కొత్త రికార్డులను సుష్టించడం ఖాయమనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్