Friday, November 22, 2024
HomeTrending Newsబాబుది పెత్తందారీ మనస్తత్వం- పవన్ శల్యుడు : పేర్ని

బాబుది పెత్తందారీ మనస్తత్వం- పవన్ శల్యుడు : పేర్ని

చిన్న ఉద్యోగస్తులు, వర్కర్లు, సర్వర్లు అంటే చంద్రబాబుకు చిన్నచూపు ఉందని, ఆయన దృష్టిలో వారికి అసలు విలువే లేదని…. అందుకే ఇటువంటి పెత్తందారీ మనస్తత్వం ఉన్న బాబుకు రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కాల్చివాత పెట్టాలని మాజీమంత్రి పేర్ని నాని సూచించారు. ఇటీవలి ఏలూరు ‘సిద్ధం’ బహిరంగసభ సందర్భంగా వైసీపీ కార్యకర్తలకు పేర్ని స్వయంగా భోజనం వడ్డిస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బాబుతో పాటు టిడిపి, జనసేన నాయకులు నానిపై వ్యంగాస్త్రాలు విసిరారు. నేడు అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన పేర్ని విపక్షాల విమర్శలపై తీవ్రంగా స్పందించారు.

“మా కార్యకర్తలకు భోజనం పెడితే సర్వర్ ఉద్యోగమా? కార్యకర్తలకు అన్నం పెడతామంటే సర్వరా? కార్యకర్తలంటే ఎంత విలువ ఉంది మీకు? ఎంత పెత్తందారీ మనస్తత్వం? మీరు చౌదిరి అని, ఎన్టీఆర్ అల్లుడివని, ఖర్జూర నాయుడు కొడుకువని మీ పెత్తందారీ మనస్తత్వం ప్రదర్శిస్తారా? సర్వర్ లు అంటే చిన్నవాళ్ళా? వారి ఓట్లు కావాలి కానీ వాళ్లు మనుషులు కాదా? వారికి కుటుంబాలు లేవా? వారికి వ్యక్తిత్తం లేదా? ఒళ్ళు వంచి కష్టపడి సర్వర్ అయితే తప్పేంటి? పెత్తందారీ మనస్తత్వం, బూర్జువా మనస్తత్వం, కులహంకారంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. అందుకే జగన్ గారు చెప్తున్నారు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి పెత్తందారులు పేదలకు వ్యతిరేకం. ఇటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా మన పోరాటం అని” అంటూ నాని ఫైర్ అయ్యారు.

తమ ప్రభుత్వం వల్ల మేలు జరిగిన ప్రతి కుటుంబం, ప్రతి వైయస్ఆర్సీపీ కార్యకర్త శ్రీకృష్ణుడిలా తనకు అండగా ఉండి నడిపించమని కోరుతుంటే… రేపు జరిగే కురుక్షేత్రంలో కుట్రలు, కుతంత్రాలతో కూటములు కట్టి మందిగా వస్తున్న కౌరవులను మట్టికరిపించడానికి ప్రజలు సిద్ధమయ్యారని నాని స్పష్టం చేశారు. అర్జునుడు అయితే ద్రౌపదిని కాపాడాలంటాడని, అర్జునుడు, ద్రౌపది సంబంధం కూడా పవన్ కు తెలియదని… కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, కుటుంబం, జీవితం గురించి పవన్ కల్యాణ్ దగ్గర నేర్చుకోవడం కంటే హాస్యాస్పదం ఏముందని ప్రశ్నించారు.

తన తల్లిని తిట్టిన వాళ్ల పల్లకి మోసే వారిని… తన నేత సిఎం కావాలని ప్రాణం పెట్టేందుకు సిద్ధమైన వారి స్థైర్యాన్ని పవన్ కళ్యాణ్ చంపేస్తున్నారని, యుద్ధానికి సిద్ధమైన జనసేన కార్యకర్తల మానసిక స్థైర్యాన్ని చంపే వాడిని శల్యుడు అంటారని…  కలియుగ భారతంలో శల్యుడు పాత్ర పవన్ కల్యాణ్ పోషిస్తున్నాడని మండిపడ్డారు. “నాడు కర్ణుడి ధైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన వాడు శల్యుడు… నేడు మీ పార్టీ కార్యకర్తల స్థైర్యాన్ని మన చేతిలో ఆయుధాలు కాదు, పల్లకీ పట్టి ఉండాలి, పల్లకీ మోయాలి అని చెప్తున్న నువ్వు కలియుగ శల్యుడివి” అంటూ పవన్ పై విమర్శలు గుప్పించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్