ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్ లో 391 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇండియాపై 27 పరుగుల ఆధిక్యం సంపాదించింది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ మొత్తం పది వికెట్లు కోల్పోయింది. మూడు వికెట్లకు 119 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ జో రూట్, బెయిర్ స్టో లు అద్భుతమైన ఆటతీరుతో ఇండియా బౌలర్ల ను ఎదుర్కొన్నారు. మొదటి టెస్టులో ప్లేయర్ అఫ్ ద సిరీస్ గెల్చుకున్న రూట్ ఈ టెస్టులోనూ మొదటి ఇన్నింగ్స్ లో 321 బంతులు ఎదుర్కొని 18 ఫోర్లతో 180 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. బెయిర్ స్టో 57 పరుగులు చేశాడు.
ఇండియా బౌలర్లలో సిరాజ్-4; ఇషాంత్ శర్మ-3; షమీ-2 వికెట్లు పడగొట్టారు. జడేజా విసిరిన అద్భుతమైన త్రో కు ఇంగ్లాండ్ బ్యాట్స్ మాన్ మార్క్ వుడ్ రన్ అవుట్ అయ్యాడు. దీనితో మొత్తం పది వికెట్లు ఇంగ్లాండ్ కోల్పోయింది.