Sunday, September 8, 2024
Homeస్పోర్ట్స్Ind Vs Eng: గెలుపు ముంగిట ఇండియా

Ind Vs Eng: గెలుపు ముంగిట ఇండియా

ఇంగ్లాండ్ తో రాంచి వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్ట్ లో ఇండియా గెలుపు దిశగా సాగుతోంది. రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ యాదవ్ లు అద్భుతంగా రాణించి రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టును 145 పరుగులకే పరిమితం చేశారు.

ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు కోల్పోయి 219 పరుగుల వద్ద నేటి మూడోరోజు ఆట మొదలు పెట్టింది. ధృవ్ జురెల్ రాణించి 90 పరుగులు చేసి సెంచరీ ముగింట ఔటయ్యాడు. దీనితో ఇండియా 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ బౌలర్లలో షోహిబ్ బషీర్ 5, టామ్ హార్ట్ లీ 3, జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు పడగొట్టారు.

46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లాండ్ ను ఐదో ఓవర్లో అశ్విన్ దెబ్బ తీశాడు. రెండు వరుస బంతుల్లో డకెట్ (15); ఓలీ పోప్(డకౌట్)లను పెవిలియన్ పంపాడు. మరో ఓపెనర్ క్రాలే-60; బెయిర్ స్టో-30 పరుగులతో ఫర్వాలేదనిపించారు. మిగిలినవారు విఫలం కావడంతో 145 పరుగులకే చాపచుట్టేసింది. మొత్తంగా 191 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో సత్తా చాటగా, కుల్దీప్ యాదవ్ 4, జడేజా ఒక వికెట్ పడగొట్టారు.

కాగా, అశ్విన్ టెస్ట్ క్రికెట్ లో  35 సార్లు ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఘనత సాధించి మన దేశానికే చెందిన అనిల్ కుంబ్లే సరసన నిలిచాడు.

192పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్ట పోకుండా 40 పరుగులు చేసింది. రోహిత్-24, యశస్వి జైస్వాల్-16 పరుగులతో క్రీజులో ఉన్నారు. విజయానికి ఇంకా 152 పరుగులు అవసరం కాగా రెండ్రోజుల ఆట మిగిలి ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్