రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఏపీకి మెరుగైన పాలన అందించాలనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. ప్రజలు అకంక్షిస్తున్న మార్పు తీసుకు రావడానికే ఈ పొత్తు కుదుర్చుకున్నామన్నారు. రాష్ట్రంలో తాము పోటీ చేసే స్థానాలు, అభ్యర్ధులపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు.
బిజెపి పాత్ర లేకుండా ఏపీలో తర్వాత ప్రభుత్వం రాదన్న విషయం తాను మొదటినుంచీ చెబుతున్నానని, ఇప్పుడు అదే నిజమైందని రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు మార్పు కోరుతున్నారని, ఆ మార్పు డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే సాధ్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను స్వయంగా తెలుసుకున్న తరువాతే ప్రధాని మోడీ పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఈ పొత్తు కుదరకుండా ఉండేందుకు వైసీపీ నేతలు చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.