జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతానికి తనకు ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, అందుకే ఎమ్మెల్యేగానే బరిలో ఉంటున్నట్లు పవన్ స్పష్టం చేశారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ ఈ నిర్ణయం ప్రకటించారు. అనంతపురం నుంచి పోటీ చేయాలని మొదట అనుకున్నానని… కానీ తన ఆశయాలను ముందుకు తీసుకెళ్లగలిగే కేడర్ అక్కడ లేదని అందుకే నిర్ణయం మార్చుకుని పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు వివరించారు.
పొత్తుల కారణంగా పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారికి కూడా టిక్కెట్లు ఇవ్వలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ధ్యవర్తిత్వం వహిస్తే ఏమి నష్టపోతామో తనకు అర్ధమైందని, పెద్ద మనసుతో వెళ్తే మనకు మనం చిన్నవాళ్ళం అయ్యామని వ్యాఖ్యానించారు. కానీ ఇది మంచిదేనని.. తాను పెద్దమనసు చేసుకుని తగ్గించుకున్నా గానీ రాష్ట్రానికి ఐదుకోట్ల ప్రజలకు తన వాళ్ళ పదిమంది త్యాగం వాళ్ళ మంచి జరుగుతుందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వాడాలని పవన్ తన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు రాబోతుందని దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే సోషల్ మీడియా వాడకనలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు ఏదైనా ఒక వార్తను పూర్తిగా నిర్ధారించి నిర్ధారించుకున్న తర్వాతే సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చెప్పారు