Friday, November 22, 2024
HomeTrending Newsబిజెపి మూడో జాబితా విడుదల

బిజెపి మూడో జాబితా విడుదల

దక్షిణాదిలో పాగా వేసేందుకు బిజెపి శతథా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఏకంగా తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయించి మరి తమిళిసై సౌందరాజన్ ను రంగంలోకి దింపింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడు రాష్ట్రంలో రెండు నుంచి మూడు ఎంపి సీట్లు కైవసం చేసుకోవాలని బిజెపి పట్టుదలతో ఉంది.

త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన 9 మంది అభ్య‌ర్థుల‌తో కూడిన మూడో జాబితాను గురువారం సాయంత్రం ఆ పార్టీ విడుద‌ల చేసింది. తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్ చెన్నై సౌత్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో దిగ‌నున్న‌ట్లు జాబితాలో పేర్కొన్నారు.

బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామ‌లై కోయంబ‌త్తూరు నుంచి బరిలో దిగుతున్నారు. మాజీ IPS అధికారి అన్నామలై తమిళ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరొందారు. ప్రస్తుత తెలంగాణ గవర్నర్ సిపి రాధకృష్ణన్ 1998, 99లలో కోయంబత్తూర్ నుంచి ఎంపిగా ప్రాతినిధ్యం వహించారు. బిజెపి బలంగా ఉన్న ఈ స్థానంలో అన్నామలై గెలిచేందుకు అవకాశం ఉందని పార్టీ విశ్వసిస్తోంది.

క‌న్యాకుమారి నుంచి రాధాకృష్ణ‌న్, చెన్నై సెంట్ర‌ల్ నుంచి వినోజ్ పీ సెల్వం, వెల్లూరు నుంచి డాక్ట‌ర్ ఏసీ ష‌ణ్ముఘం, కృష్ణ‌గిరి నుంచి సీ న‌ర‌సింహా, పెరంబ‌లూరు నుంచి టీఆర్ ప‌ర్వేంధ‌ర్, తూత్తూకుడి నుంచి నైనార్ న‌రేంద్ర‌న్ పోటీ చేయ‌నున్నారు.

కేంద్రమంత్రి డాక్ట‌ర్ లోకనాథన్ మురుగ‌న్ నీల‌గిరిస్ నుంచి పోటీ చేస్తున్నారు. DMK సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజాతో తలపడుతున్నారు. మురుగన్ కు వ్యుహాత్మకంగానే కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన బిజెపి నాయకత్వం…  SC నియోజకవర్గంలో ఈ దఫా తమ సత్తా చాటుతామని ధీమాతో ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్