Sunday, February 23, 2025
Homeసినిమాతమన్ చేతులు మీదుగా 'అర్థం' ఫస్ట్‌ లుక్ విడుదల

తమన్ చేతులు మీదుగా ‘అర్థం’ ఫస్ట్‌ లుక్ విడుదల

‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, శ్రద్ధా దాస్, అజయ్, ఆమని, సాహితీ అవంచ, ‘వైశాలి’ ఫేమ్ నందన్ ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘అర్థం’. రిత్విక్ వెత్సా సమర్పణలో మినర్వ మూవీ మేకర్స్, ఎస్‌విఎమ్ (శ్రీ వాసవి మూవీ) ప్రొడక్షన్స్ పతాకాలపై రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా తెరకెక్కింది. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి రచయిత, దర్శకుడు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకులు తమన్ ఈ సినిమా ఫస్ట్‌ లుక్ ట్విట్టర్ ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

దర్శకుడు మణికాంత్ తెల్లగూటి మాట్లాడుతూ.. “కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న సినిమా – ‘అర్థం’. సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాకి వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం. వీఎఫ్ఎక్స్‌లో నాకు అనుభవం ఉండటంతో సినిమా వీఎఫ్ఎక్స్‌ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తున్నాను. అత్యుత్తమ నిర్మాణ విలువలతో రాధికా శ్రీనివాస్ గారు సినిమా నిర్మించారు” అని అన్నారు.

అజయ్, శ్రద్దా దాస్, ఆమని, మహేంద్ర, సాహితీ అవంచ, నందన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి, మాటలు-పాటలు: రాకేందు మౌళి, నృత్యాలు: సుచిత్రా చంద్రబోస్, పోరాటాలు: నందు – అంజి – డైమండ్, ఛాయాగ్రహణం: పవన్ చెన్నా, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, సహ నిర్మాతలు: పవన్, వెంకట రమేష్, నిర్మాత: రాధికా శ్రీనివాస్, రచన-కూర్పు-దర్శకత్వం: మణికాంత్ తెల్లగూటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్