Monday, November 25, 2024
Homeస్పోర్ట్స్అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ : సొంతగడ్డపై హైదరాబాద్ కు రెండో విజయం

అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ : సొంతగడ్డపై హైదరాబాద్ కు రెండో విజయం

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. చెనై ఇచ్చిన 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సొంతం చేసుకుంది హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేవలం 12 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 37 పరుగులు చేసి సత్తా చాటాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 24 బంతుల్లో 31పరుగులు చేసి ఔటయ్యాడు. ఏడెన్ మార్ క్రమ్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో అర్ధ సెంచరీ పూర్తి చేసి మొయిన్ అలీ బౌలింగ్ లో ఎల్బీ గా వెనుదిరిగాడు. షాబాద్ అహ్మద్ 18 రన్స్ చేసి ఔట్ కాగా, క్లాసేన్ 10, నితీష్ కుమార్ రెడ్డి 14 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ 2, దీపక్ చాహర్, తీక్షణ చెరో వికెట్ పడగొట్టారు.

తకుముందు టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్ రచిన్ రవీంద్ర 12 పరుగులు చేసి జట్టు స్కోరు 25 వద్ద ఔటయ్యాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26 పరుగులు చేయగా.. మూడో వికెట్ కు రేహానే- శివమ్ దూబే లు 65 పరుగులు జోడించారు. రేహానే-35; దూబే 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 45 పరుగులతో రాణించారు. చివర్లో జడేజా31 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 రన్స్ చేసింది. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, నటరాజన్, పాట్ కమ్మిన్స్, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనాద్కత్ తలా ఒక వికెట్ సాధించారు.

ఇప్పటి వరకూ నాలుగు మ్యాచ్ లు ఆడిన హైదరాబాద్ సొంతగడ్డపై జరిగిన రెండు మ్యాచ్ ల్లోనూ గెలుపొందడం గమనార్హం.

అభిషేక్ శర్మ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్