Saturday, November 23, 2024
HomeTrending Newsకేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం

కేంద్ర కేబినెట్ కమిటీ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోడి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) ఢిల్లీ లో అత్యవసరంగా సమావేశమైంది. ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు, మన దేశం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై నేతలు చర్చించారు. సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లతో పాటు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. తాలిబన్లు కాబూల్ ఆక్రమించుకున్నాక భారతీయులను స్వదేశానికి తీసుకు రావటం సవాల్ గా మారింది. విమానాశ్రయంలో అల్లకల్లోల పరిస్థితులు ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అక్కడి పరిణామాలను రాత్రి పొద్దుపోయే వరకు ప్రధానమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత రాయాబార కార్యాలయ సిబ్బంది, సాధారణ పౌరులు, మీడియా సిబ్బంది సురక్షితంగా స్వదేశానికి చేర్చే అంశాలపై ప్రధానమంత్రి నిరంతరం అధికారులతో చర్చిస్తున్నారు. ఎయిర్ ఫోర్సు విమానంలో ఈ రోజు రాయబార సిబ్బంది గుజరాత్ లోని జామ్ నగర్ రాగా మరో రెండు ఐ.ఏ.ఫ్. ఎయిర్ క్రాఫ్ట్స్ లలో ఇతర అధికారులు, పౌరులు ఘజియాబాద్ హిందన్ ఎయిర్ బేస్ చేరుకున్నారు.

జమ్మూ కశ్మీర్ సహా దేశంలోని ముఖ్య నగరాల్లో భద్రత పెంచి, నిఘా విభాగాలను అప్రమత్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్