బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు ఈసీ నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించినట్లు ఈసీ వెల్లడించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు కేసీఆర్‌పై ఈసీ చర్యలు తీసుకుంది.
48 గంటల పాటు విధించిన నిషేధానికి సంభందించిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు బస్సు యాత్రలో ఉన్న కేసీఆర్ కు అందించారు.
గత నెల ఏప్రిల్ 6న సిరిసిల్లలో కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. మే 1 రాత్రి 8 గంటల నుంచి మే 3వ తేది రాత్రి 8 గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఉండదు.