నైరోబీ లో జరుతుగున్న ప్రపంచ అథ్లెటిక్స్ అండర్ -20 ఛాంపియన్ షిప్ లో ఇండియా ఆటగాడు రోహన్ కాంబ్లే సెమీస్ కు చేరుకున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో నిర్ణీత లక్ష్యాన్ని 55.00 సెకన్లలో చేరుకొని సెమీస్ లోకి అడుగుపెట్టాడు. నిన్ననే మన దేశ అథ్లెట్లు 400X4 రిలే పరుగు పందెంలో కాంస్య పతాకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
ఇంతకుముందు మన దేశానికి చెందిన సీమా- డిస్కస్ త్రో- కాంస్యం (2002); నవదీప్ కుమార్ – డిస్కస్ త్రో- కాంస్యం (2014); నీరజ్ చోప్రా – జావెలిన్ త్రో- స్వర్ణం (2016); హిమా దాస్ – 400 మీటర్ల పరుగు పందెం – స్వర్ణం (2018)లు మన దేశం తరఫున పతకాలు సాధించారు.
నిన్న ఆగస్ట్ 18న ప్రారంభమైన ఈ పోటీలు ఆగస్టు 22 వరకూ ఐదురోజులపాటు జరుగుతాయి. నిన్న మనదేశానికి చెందిన ప్రియ మోహన్ (400 మీటర్ల పరుగుపందెం); అమన్ దీప సింగ్ (పురుషుల షాట్ పుట్); అజయ్ సింగ్ రాజ్ రానా-జయ్ కుమార్ (జావెలిన్ త్రో) విభాగాల్లో ఫైనల్ కు చేరుకున్నారు.