నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. రుతుపవనాలు లక్షద్వీప్ ప్రాంతం మీదుగా కేరళలోకి ప్రవేశించాయని పేర్కొంది. రుతుపవనాల విస్తరణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు, నైరుతి, మధ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, సిక్కీంలోని పలు ప్రాంతాల్లోకి రాబోయే రెండుమూడు రోజుల్లోనే విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
ఈసారి రుతుపవనాలు కేరళలో సమయం కంటే ముందే వస్తున్నాయి. అయితే ఇప్పటికే భారీ వర్షాలతో కేరళ అల్లాడిపోతోంది.
ఈరోజు కొట్టాయం, ఎర్నాకులం జిల్లాల్లో రెడ్ అలర్ట్,మరో మూడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలుకు జూన్ 5 నాటికి చేరుతాయి. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగువ భాగం, పశ్చిమ బెంగాల్ కు జూన్ 10న చేరుకుంటాయని ఐఎండీ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయి. ఇది ఉప్పెనతో ఉత్తరం వైపు కదులుతుంది. జూలై 15 నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేస్తుంది. దీనికి ముందు.. మే 22న రుతుపవనాలు అండమాన్, నికోబార్‌ను దీవులను తాకాయి. ఈసారి రుతుపవనాలు సాధారణం కంటే 3 రోజులు ముందుగా మే 19న అండమాన్‌కు వచ్చాయి. దేశంలో ఎల్‌నినో వ్యవస్థ బలహీనపడి లా నినా పరిస్థితులు చురుగ్గా మారుతున్నాయని, ఈ ఏడాది వర్షాలు బాగా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. సమయానికి ముందే రుతుపవనాలు దేశంలోకి రావడమే దీనికి కారణమని తెలిపింది. అదే సమయంలో లా నినాతో పాటు హిందూ మహాసముద్ర ద్విధ్రువ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి.