Friday, November 22, 2024
HomeTrending Newsభారత ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా సంకుచిత కథనాలు

భారత ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా సంకుచిత కథనాలు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియాతో పాటు ప్రపంచ మీడియా కూడా దృష్టిని సారించింది. ఈ ఎన్నికల్లో బిజెపి, దాని కూటమికి చేదు ఫలితాలు వచ్చాయని నివేదించాయి. భారత దేశంలో ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా విశ్లేషణలు మోడికి వ్యతిరేకంగా సాగాయి. అందులో బిజెపిని మోడీ పాలనను టార్గెట్ చేస్తూ కథనాలు వెలువరించాయి.

ప్రధాని మోడీ ఒంటెద్దు పోకడలకు, విద్వేష భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా అభివర్ణించాయి. ది వాషింగ్టన్‌ పోస్ట్‌, ది గార్డియన్‌, బిబిసి వంటి అంతర్జాతీయ వార్త సంస్థలు కేంద్రంలో బిజెపి తీరును కడిగిపారేశాయి. వాటి కథనాల సారాంశం కుప్లంగా..

ది వాషింగ్టన్‌ పోస్ట్‌

అమెరికా డైలీ ‘ది వాషింగ్టన్‌ పోస్ట్‌’.. భారత్‌లోని లోక్‌సభ ఎన్నికలు ప్రధాని మోడీకి, ఆయన పార్టీ (బిజెపి)కి పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించింది. ప్రధాని మోడీ నాయకత్వాన్ని ఊహించని తిరస్కరణగా ఓటర్లు నిర్ణయించారని పేర్కొన్నది. ఈ ఫలితాలు దశాబ్దాలలో అత్యంత ప్రబలమైన భారత రాజకీయ నాయకుడి అజేయ ప్రకాశాన్ని ప్రభావితం చేశాయని వివరించింది. ఇన్నేండ్ల తర్వాత తొలిసారి మోడీ బలహీనంగా కనిపించారని ది వాషింగ్టన్‌ పోస్ట్‌ రాసుకొచ్చింది.

ది గార్డియన్‌

ఎన్నికల్లో బిజెపికి విజయం ఏకపక్షమనే అంచనాలు నిజం కాలేదని బ్రిటీశ్‌ డైలీ ది గార్డియన్‌ పేర్కొన్నది. బలమైన ప్రధానికి, ఆయన హిందూ జాతీయవాద రాజకీయాలకు వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎదురుదెబ్బలు తగిలినట్టు స్పష్టమైందని వివరించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మోడీకి ‘ఊహించని దెబ్బ’గా ఎలా నిలిచాయో తన కథనంలో ‘ది గార్డియన్‌’ రాసుకొచ్చింది. ఎన్నికల ప్రచారాల్లో మత రాజకీయాలను తీసుకొచ్చి ఓట్లను పొందుదామని బిజెపి భావించిందని వివరించింది. ప్రతిపక్ష ఇండియా కూటమి విజయాన్ని హైలెట్‌ చేసింది.

బిబిసి

లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ మెజారీటీతో ప్రధాని మోడీ విజయాన్ని సాధించారని బీబీసీ నివేదించింది. మోడీ పదేండ్ల పాలనకు ఈ ఎన్నికలు రెఫెరెండం అని అంతా భావించారని, అయితే ఎన్నికల ఫలితాలు నిరుత్సాహ పరిచాయని వివరించింది. ఆశించిన ఫలితాలు సాధించకపోవటంతో దేశవ్యాప్తంగా బిజెపి కార్యాలయాలు ‘విచారంగా, చీకటి’గా కనిపించాయని బిబిసి రిపోర్టర్లు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలు బిజెపికి పోటీనిచ్చాయని బిబిసి గుర్తించింది.

ది న్యూయార్క్‌ టైమ్స్‌

ది న్యూయార్క్‌ టైమ్స్‌… మోడీ తన ప్రాభవాన్ని కోల్పోయారని పేర్కొన్నది. ఈ ఎన్నికల్లో ఆయన అధికారంలో ఉండాలంటే ఇతర పార్టీల సాయం కావాల్సి ఉంటుందని నివేదించింది. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత మోడీపై కనబడిందని వివరించింది.

లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో బహుళజాతి సంస్థల వనరుల దోపిడీ, గల్ఫ్ దేశాల్లో పశ్చిమ దేశాల అరాచకాలపై నోరుమోదపని పాశ్చాత్య మీడియా… భారత దేశ ఎన్నికలపై సంకుచిత దృక్పథంతో విశ్లేషణలు చేశాయని విమర్శలు వస్తున్నాయి. భారత ఎన్నికల్లో ప్రజాస్వామ్య రీతిలో ప్రజలు ఇచ్చిన తీర్పుగా కొనియాడక పోవటం దురదృష్టకరం.

అధికార పార్టీ ప్రజారంజక పాలన విస్మరిస్తే భారతీయులు ఓటుతో వేటు ఎలా వేస్తారో పరిశీలనాత్మకంగా వార్తలు రాయల్సిందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్