Thursday, September 19, 2024
HomeTrending Newsపవన్ కాదు, తుఫాన్ : మోడీ ప్రశంస

పవన్ కాదు, తుఫాన్ : మోడీ ప్రశంస

ఆంధ్ర ప్రదేశ్ ఎన్డీయే కూటమి చారిత్రక విజయం సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు ఓ గొప్ప మద్దతు ఇచ్చి గెలిపించారన్నారు. ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్ లో జరిగిన ఎన్డీయే పక్షాల సమావేశంలో ఏపీలో కూటమి భారీ విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ పై నరేంద్ర ప్రశంసలు కురిపించారు. ఆయనను ఉద్దేశించి మాట్లాడుతూ  ‘ఇక్కడ కూర్చున్నాడు చూడండి.. ఇతను పవన్ కాదు, తుఫాన్’ అంటూ అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమకు పెద్ద ఎత్తున మద్దతిచ్చారని మోదీ అన్నారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నామని వివరించారు. దక్షిణాదిన ప్రజలు ఎన్డీయేను అక్కున చేర్చుకున్నారని… కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడ్డాయని…. కానీ అతి తక్కువ కాలంలోనే ఆ ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని అన్నారు.

ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా దేశ అభివృద్దిలో సరికొత్త అధ్యాయం లిఖించామని, వికసిత్ భారత్ స్వప్నాన్ని సాధించి తీరుతామని స్పష్టం చేశారు. ఎన్డీయే కూటమి 30 ఏళ్ళుగా నడుస్తోందని, ఇన్నేళ్ళు కూటమిగా ఉండడం సామాన్యమైన విషయం కాదని, ఇది ఓ అత్యంత విజయవంతమైన కూటమి  అని, మూడు దశాబ్దాలలో మూడుసార్లు ఐదేళ్లపాటు కూటమి దేశాన్ని పాలించిందని గుర్తు చేస్తూ… మరోసారి మరో ఐదేళ్ళు పాలించేందుకు ప్రజలు అవకాశమిచ్చారని కృతజ్ఞతలు తెలియజేశారు. దేశాన్ని మరింత ముందుకు తీసుకు వెళతామని హామీ ఇచ్చారు. గెలుపును ఎంత ఆవ్వాదిస్తామో పరాజితులను కూడా అంటే గౌరవిస్తామని… ఓడిపోయినవారిని అపహాస్యం చేసే సంస్కృతి తమది కాదన్నారు. పదేళ్ళ తర్వాత కూడా కాంగ్రెస్ కు వంద సీట్లు దాటలేదని ఎద్దేవా చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్