Friday, November 22, 2024
HomeTrending Newsతెలుగు ప్రజలపై రామోజీది తిరుగులేని ప్రభావం : చంద్రబాబు

తెలుగు ప్రజలపై రామోజీది తిరుగులేని ప్రభావం : చంద్రబాబు

మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతిపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న బాబు తన కార్యక్రమాలు వాయిదా వేసుకొని హైదరాబాద్ కు రానున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ చేరుకొని రామోజీ భౌతిక కాయానికి నివాళులర్పించానున్నారు. ఢిల్లీలో ఎంపిలతో కలిసి రామోజీ చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించారు.

“ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన శ్రీ రామోజీ తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం తెలుగు ప్రజలకే కాదు….దేశానికి కూడా తీరని లోటు. సమాజ హితం కోసం అనుక్షణం పనిచేసిన ఆయన కీర్తి అజరామరం. ఈనాడు గ్రూపు సంస్థల స్థాపనతో వేల మందికి ఉపాధి కల్పించారు. మీడియా రంగంలో శ్రీ రామోజీ గారిది ప్రత్యేకమైన శకం. ఎన్నో సవాళ్లను, సమస్యలను అధిగమించి…ఎక్కడా తలవంచకుండా శ్రీ రామోజీరావు విలువలతో సంస్థలను నడిపిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దశాబ్దాల తన ప్రయాణంలో అనుక్షణం ప్రజల మంచి కోసం, సమాజ హితం కోసం శ్రీ రామోజీరావు పనిచేశారు. మీడియా రంగంలో ఆయనొక శిఖరం, ఆయన ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాము. శ్రీరామోజీరావుతో నాకు 4 దశాబ్దాల అనుబంధం ఉంది. మంచిని మంచి, చెడును చెడు అని చెప్పే ఆయన తీరు… నన్ను ఆయనకు దగ్గర చేసింది” అంటూ తన సంతాపం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్