Saturday, January 18, 2025
Homeసినిమా'కల్కి'లో విజయ్ దేవరకొండ పాత్ర అదేనట!

‘కల్కి’లో విజయ్ దేవరకొండ పాత్ర అదేనట!

విజయ్ దేవరకొండకి ఈ మధ్య కాలంలో హిట్ పడలేదు. అలాగని ఆయన క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదు. ఆయన ప్రాజెక్టులు కొన్ని చర్చల దశలో ఉంటే, మరికొన్ని ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ‘కల్కి’ సినిమాలోనూ విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. ఒక పాన్ ఇండియా సినిమాలో .. ఇంతటి భారీ బడ్జెట్ చిత్రంలో .. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే సినిమాలో చేయడం విజయ్ దేవరకొండకి ఇదే మొదటిసారి.

ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, అమితాబ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఇక ఇదే సినిమాలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ పేరు వినిపించింది. ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడు? ఏ లుక్ తో కనిపించనున్నాడు? అనేది అభిమానులలో ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారిపోయింది. ఆ విషయం తెలుసుకోవడానికి వాళ్లంతా కుతూహలాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక వార్త బయటికి వచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర అర్జునుడిని పోలి ఉంటుందని అంటున్నారు. ఈ కథ పురాణాలతో ముడిపడి ఉంటుంది. అందువలన అమితాబ్ పాత్రను కూడా అశ్వద్ధామగానే పరిచయం చేశారు. అర్జునుడిని పోలిన విజయ్ దేవరకొండ పాత్ర నిడివి కూడా ఎక్కువగానే ఉంటుందనీ, ఇలా వచ్చి అలా వెళ్లిపోయే పాత్ర కాదని అంటున్నారు. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్