ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. తొలుత ఏరియల్ సర్వే నిర్వహించిన సిఎం ఆ తర్వాతా డ్యామ్ సైట్ ను పరిశీలించి… పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్పిల్ వే, కాఫర్ డ్యామ్, దయాఫ్రమ్ వాల్ లను కూడా బాబు పరిశీలించారు. వాటి నిర్మాణం ఏ దశలో ఉన్నదీ, ఇంకా ఎంత శాతం మేర పనులు పూర్తి చేయాల్సి ఉందన్న సమాచారంపై ఆరా తీశారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత తొలి పర్యటనగా పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు చంద్రబాబు రావడం గమనార్హం. హెలికా హెలికాఫ్టర్ లో సైట్ వద్దకు చేరుకున్న చంద్రబాబుకు మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్ధసారథి, కందుల దుర్గేశ్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఎడమగట్టు దగ్గర కుంగిన గైడ్ బండ్ ప్రాంతాన్ని వీక్షించిన సిఎం… కుడి కాల్వను ఎక్కదివరకూ పొడిగించవచ్చనే దానిపై వివరాలు సేకరించారు.
సందర్శన పూర్హయిన తరువాత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆ తర్వాత పోలవరం గెస్ట్ హౌస్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.