Friday, November 22, 2024
HomeTrending Newsకెసిఆర్ కు డాక్టర్ల పరీక్ష.. గులాబీ బాస్ కారు డ్రైవింగ్

కెసిఆర్ కు డాక్టర్ల పరీక్ష.. గులాబీ బాస్ కారు డ్రైవింగ్

బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ గురువారం ఓమ్నీ వ్యాన్ న‌డిపారు. కేసీఆర్ డ్రైవింగ్ చేసిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కాలు ఆపరేషన్ తరువాత కర్ర సహాయం లేకుండా కేసీఆర్ న‌డుస్తున్నారు. కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించ‌డంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్ న‌డిపారు. గ‌తేడాది డిసెంబ‌ర్ 8వ తేదీన అర్ధ‌రాత్రి కేసీఆర్ కాలు జారిప‌డ్డారు. దీంతో కుటుంబ స‌భ్యులు కేసీఆర్‌ను సోమాజిగూడ‌లోని య‌శోదా ఆస్ప‌త్రిలో చికిత్స చేయించారు.

కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స నిర్వ‌హించ‌గా, అది విజయవంతమైంది. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి నడిపించారు. వైద్యుల సూచనల మేరకు వాకర్‌ సాయంతో బీఆర్‌ఎస్‌ అధినేత మెల్లగా అడుగులు వేశారు. ఇక డిశ్చార్జి అయిన త‌ర్వాత కొద్ది నెలలుగా క‌ర్ర సాయంతో కేసీఆర్ నడుస్తున్నారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ప్పుడు కూడా క‌ర్ర సాయంతోనే కేసీఆర్ ప్ర‌చారంలో పాల్గొన్నారు. కేసీఆర్ కోలుకోవ‌డంతో.. కొద్ది రోజుల నుంచి క‌ర్ర సాయం లేకుండానే న‌డ‌వ‌గ‌లుగుతున్నారు. దీంతో కారు నడిపి చూడమని డాక్టర్లు సూచించ‌డంతో తన పాత ఓమ్నీ వ్యాన్‌ను కేసీఆర్ న‌డిపారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్