Monday, November 25, 2024
HomeTrending Newsలోనావాలాలో విషాదం.. ఓ కుటుంబం వరదలో గల్లంతు

లోనావాలాలో విషాదం.. ఓ కుటుంబం వరదలో గల్లంతు

మహారాష్ట్రలో ఆదివారం ఆహ్లాదంగా సేదదీరేందుకు వెళ్ళిన ఓ కుటుంబంలో భారీ వర్షం విషాదం నింపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదంలో ఐదుగురిని మృత్యువు కబళించింది. ముంబై స‌మీపంలోని లోనావాలా కొండ‌ల‌పై ఉన్న జ‌ల‌పాతంలోకి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఏడు మంది ఆ నీటి ప్ర‌వాహంలో కొట్టుకుపోయారు.

ఈ ఘ‌ట‌న ఆదివారం మ‌ధ్యాహ్నం జ‌రిగింది. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ప్ర‌స్తుతం ముగ్గురు మహిళల మృత‌దేహాల‌ను వెలికి తీశారు. మిగితా వారి కోసం సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. ఇద్ద‌రు మాత్రం ఈదుకుంటూ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

వార్షాకాలం కావ‌డంతో.. లోనావాలాకు భారీ సంఖ్య‌లో టూరిస్టులు వ‌స్తుంటారు. ఈ క్రమంలో భుషి డ్యామ్ బ్యాక్‌వాట‌ర్ వ‌ద్దకు  పూణే నగరానికి చెందిన ఓ కుటుంబం పిక్నిక్ వెళ్ళింది. ఉద‌యం నుంచి ఆ ప్రాంతంలో భారీ వ‌ర్షం పడగా డ్యామ్ ఓవ‌ర్ ఫ్లో అయ్యింది. అక‌స్మాత్తుగా జ‌ల‌పాతం తీవ్ర స్థాయిలో ఉప్పొంగింది.

జ‌ల‌పాతం మ‌ధ్య‌లో చిక్కుకుపోయిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు నీటి ప్ర‌వాహం పెర‌గ‌డంతో ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఒక‌ర్ని ఒక‌రు ప‌ట్టుకున్నారు. శ‌ర‌వేగంగా వ‌స్తున్న నీటి మ‌ధ్య‌లోనే భ‌యంతో గుంపుగా ఉండిపోయారు. దూసుకువ‌స్తున్న నీటి నుంచి తప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ క్ష‌ణాల్లోనే నీరు ఉదృత‌రూపం దాల్చింది. ఆ బ‌ల‌మైన ప్ర‌వాహానికి ఏడు మంది ఒకేసారి కొండ‌ల మీద నుంచి కింద‌కు కొట్ట‌కుపోయారు.

కాపాడండి అంటూ వాళ్లు అరుస్తున్నా.. అక్క‌డే ఉన్న మిగితా టూరిస్టులు కూడా ఏమీ చేయ‌లేక‌పోయారు. నీటి ప్ర‌వాహం ఎక్కువ‌గా ఉన్న కార‌ణంగా.. వాళ్ల స‌మీపానికి ఎవ‌రూ వెళ్ల‌లేక‌పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్క‌డ‌కు వ‌చ్చారు. తాళ్లు, ట్రెక్కింగ్ సామాగ్రితో మిస్సైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

courtesy: Kadak News

RELATED ARTICLES

Most Popular

న్యూస్