Saturday, February 22, 2025
HomeUncategorizedజింబాబ్వే చేతిలో భారత్ పరాజయం

జింబాబ్వే చేతిలో భారత్ పరాజయం

జింబాబ్వేతో జరుగుతోన్న టి20 సిరీస్ తొలి మ్యాచ్ లో భారత్ పరాజయం పాలైంది. ప్రత్యర్థి ఇచ్చిన 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 102 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (37) ఒక్కడే రాణించగా… చివర్లో వాషింగ్టన్ సుందర్-27; అవేశ్ ఖాన్ -16 మినగా మిగిలినవారెవ్వరూ సింగల్ డిజిట్ దాటలేకపోయారు. జింబాబ్వే బౌలర్లు సమిష్టిగా రాణించి భారత్ ను కట్టడి చేశారు. సికందర్ రాజా, ఛతారా చెరో 3 వికెట్లు పడగొట్టారు.

హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. రవి బిష్ణోయ్-4 వికెట్లతో సత్తా చాటాడు, వాషింగ్టన్ సుందర్ 2; ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టాడు. జింబాబ్వే లో క్లైవ్ మదండే-29; మఏర్స్-23. బ్రియాన్ బెన్నెట్-22; మధేవేరే-21 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది.

సికిందర్ రాజా కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్