గుజరాత్ తరహాలో రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ కు వ్యతిరేకంగా ఓ చట్టాన్ని వీలైనంత త్వరలో తీసుకొస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ భూదందాలు, సహజవనరుల దోపిడీపై సచివాలయంలోని మొదటి బ్లాక్ మొదటి అంతస్తులో శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ సహజవనరులు, ఖనిజ సంపదను దోపిడీ చేసిందని, అడవులను వైసీపీ నేతలు ధ్వంసం చేశారని, ఇష్టానుసారం భూములను ఆక్రమించారని, ఇళ్ళ స్థలాల పేరుతో భూ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు.
ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ…
- వైసీపీ ప్రభుత్వం సరికొత్త విధానంతో దోపిడీకి పాల్పడింది. అనర్హులకు.. భూములు కేటాయించారు
- నేరస్తులు అందరూ ఆర్థిక ఉగ్రవాదులు
- హౌస్ సైట్ పేరుతో ఇష్టానుసారంగా కొన్నారు.. పెద్ద ఫ్రాడ్ చేశారు
- విశాఖపట్నంలో ఓల్డ్ ఏజ్ భూములను కూడా వదల్లేదు
- విశాఖపట్నంలో దస్పల్లా భూములను అక్రమంగా కొనుగోలు చేశారు
- ఒంగోలు జిల్లాలో కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి బలవంతంగా భూములను కబ్జా చేశారు
- తిరుపతి మండలంలో కూడా విపరీతంగా ప్రభుత్వ భూములను కబ్జా చేశారు
- చిత్తూరు జిల్లాలో కూడా పట్టా ల్యాండ్ లను అగ్రికల్చర్ ల్యాండ్ లుగా మార్చేశారు
- గత ప్రభుత్వ తీరుతో 130 మంది భావన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు
- జీవో నంబర్ 340 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో అనుమతి లేకుండా వైసీపీ కార్యాలయాలు కట్టడం మొదలు పెట్టారు
- ఒక్క విశాఖలోనే రూ.40 వేల కోట్ల రూపాయల భూములు కొట్టేశారు
- మైనింగ్ లో రూ. 20 వేల కోట్ల వరకూ దోపిడీ జరిగింది
- అసైన్డ్ భూములను కూడా వైసీపీ నేతలు తక్కువ ధరకు కొట్టేశారు
- గత ప్రభుత్వంలో భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ఫిర్యాదు చేయాలి
- భూములు లాక్కున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం
- అవసరమైతే వారికి న్యాయ సహాయం కూడా అందిస్తాం
- భవిష్యత్తులో భూ కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తాం
- మీ భూములను తిరిగి మీకు అప్పగించే బాధ్యత మాది
- రూ. 500 కోట్లతో రిషికొండపై ప్యాలస్ కట్టారు,
- ఎందుకు కట్టారు అని అడిగితే రాష్ట్రపతి, ప్రధాని కోసం గెస్ట్ హౌస్ అన్నారు
- భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి కానీ ఇష్టానుసారం దోపిడీ చేయడం సరికాదు
- క్రషర్ నుంచి క్వారీ వరకూ ఎవరినుంచి బలవంతంగా లాక్కుంటే వారు ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలి
- అడవులను మింగేసే అనకొండలను శిక్షించాల్సిన అవసరం ఉంది