తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా వైఎస్సార్సీపీ ఈనెల 24న దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టనుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ విషయాన్ని ప్రకటించారు. నేడు వినుకొండలో పర్యటించిన జగన్ దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రషీద్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని…. తనతో సహా పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ, రాజ్య సభ సభ్యులం ఢిల్లీలో నిరసన చేపడతామని చెప్పారు. అనంతరం రాష్ట్రపతిని కలుసుకొని వినతిపత్రం అందజేసే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా, ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల22న మొదలు కానున్నాయి. ఐదు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. దీనితో పాటు రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఆర్ధిక అంశాలపై సభలో శ్వేతపత్రాలు ప్రవేశ పెట్టి వాటిపై సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రవేశ పెట్టిన శ్వేతపత్రాలపై కూడా చర్చ చేపట్టనున్నారు.