Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్Womens Asia Cup: పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం

Womens Asia Cup: పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం

శ్రీలంక వేదికగా నేడు మొదలైన మహిళల టి20 ఆసియా కప్ లో ఇండియా బోణీ కొట్టింది. దాయాది పాకిస్తాన్ పై 7 వికెట్లతో ఘనవిజయం సాధించింది. దంబుల్లా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన  మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇండియా ఈ లక్ష్యాన్ని 14.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

పాక్ లో అమీన్-25; టుబా హసన్-22; ఫాతిమా సనా-22 పరుగులు చేశారు. ఇండియా బౌలర్లలో దీప్తి శర్మ 3 వికెట్లతో సత్తా చాటగా…. రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్, శ్రేయంకా పాటిల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

లక్ష్య సాధనలో ఇండియా తొలి వికెట్ కు 85 రన్స్ చేసింది. స్మృతి మందానా 35 బంతుల్లో 9 ఫోర్లతో 45; షఫాలీ వర్మ 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 40 రన్స్ చేసి విజయానికి పునాదులు వేసి ఔట్ అయ్యారు, హేమలత 14 రన్స్ చేసి వెనుదిరగ్గా… కెప్టెన్ హర్మన్-5; రోడ్రిగ్యూస్-3 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

దీప్తి శర్మకు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్