గురుపౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో చంద్రబాబు పాల్గొని వేణు దత్తాత్రేయ స్వామి వారి అభిషేకం, పాదుకపూజ నిర్వహించారు.
” సమున్నత జీవన గమ్యాన్ని ఏర్పరచుకోవాలన్న వేదవ్యాసుడి ఉపదేశాన్ని అనుసరిస్తూ గురువుల పట్ల అత్యంత గౌరవంతో మెలగాలని, ప్రజలంతా మహోన్నత ఆశయాలతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను” అంటూ ఓ సందేశాన్ని తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
మరోవైపు వచ్చే నెల ఒకటో తారీఖుల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు విధిగా పాల్గొనాలని బాబు ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీన అందరూ ఈ కార్యక్రనానికి హాజరై లబ్దిదారులకు పంపిణీ చేయాలని సూచించారు. ఆ రోజు ఎన్ని ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకోవాలన్నారు. 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని సూచించారు.