Sunday, November 24, 2024
HomeTrending Newsఎట్టకేలకు తప్పుకున్న బిడెన్

ఎట్టకేలకు తప్పుకున్న బిడెన్

అమెరికా అధ్యక్ష పదవి పోటీ నుంచి ప్రస్తుత ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తన నిర్ణయంపై త్వరలోనే వివరణ ఇస్తానని, దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తానని తెలిపారు. కాగా బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతల (డెమోక్రాట్లు) నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

డెమోక్రాటిక్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బైడెన్ స్వల్ప మెజారిటీతో డోనాల్డ్ ట్రంప్ పై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. అయితే ఆయన వయసు 81 సంవత్సరాలు, వయోభారం కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా వ్యవహరించలేకపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తో ముఖాముఖి చర్చల్లోనూ ఆయన వెనకబడి పోయారు. ఈ కారణంగా ఆయన్ను పోటీ నుంచి తప్పించాలని డెమోక్రాటిక్ పార్టీ నిర్ణయించి.. ఆయనకే తప్పుకునేందుకు అవకాశం ఇచ్చింది.

పరిస్థితులను గమనించి జో ఎట్టకేలకు రేసునుంచి వైదొలిగారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధి విషయంలో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు మొదట్లో వ్యతిరేకంగా ఉన్న బిడెన్ తాజాగా ఆమె అభ్యర్ధిత్వానికి సైతం అంగీకారం తెలిపారు.  ట్రంప్ తో తలపడేందుకు కమల తో పాటు కాలిఫోర్నియా, గీష్ గాన రాష్ట్రాల గవర్నర్లు గావిన్ న్యూసమ్, గ్రెట్సెన్ విట్మర్ లు కూడా పోటీ పడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్