Sunday, November 24, 2024
Homeసినిమాఈ తరం ప్రేక్షకులకు దూరంగా 'మనోరథంగల్'

ఈ తరం ప్రేక్షకులకు దూరంగా ‘మనోరథంగల్’

బాలచందర్ ‘బుల్లితెర కథలు’ అంటూ చాలా కాలం క్రితం కొన్ని కథలు ప్రేక్షకులను పలకరించాయి. దర్శకుడి వైపు నుంచి ఎంపికైన కథలు అలా ఆడియన్స్ ను అలరించాయి. ఇక రచయితల వైపు నుంచి కూడా కొన్ని కథలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలా మలయాళ రచయిత టి. వాసుదేవనాయర్  కలం నుంచి జాలువారిన కథలను ‘మనోరథంగల్’ పేరుతో రూపొందించారు. జీ 5లో ఈ నెల 15 నుంచి ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.

గతంలో ఈ కథలన్నీ పాఠకులను అలరించినవే. వాసుదేవనాయర్ అందించిన 9 కథలను 9 ఎపిసోడ్స్ గా చిత్రీకరించారు. అందుకోసం 8 మంది దర్శకులు పని చేశారు. మలయాళంలో వాసుదేవనాయర్ కి మంచి పేరు ఉంది. అందువలన ఆయన పట్ల గల గౌరవంతో మమ్ముట్టి .. మోహన్ లాల్ .. ఫహాద్ ఫాజిల్ .. బిజూ మీనన్ వంటి సీనియర్ స్టార్స్ ముందుకు రావడం గమనించవలసిన విషయం. ఇతర పాత్రలలో .. మధుబాల .. అపర్ణ బాలమురళి .. పార్వతి తిరువోతు వంటి మరికొందరు ఆర్టిస్టులు కనిపిస్తారు.

టైటిల్ .. తారాగణం .. ఆడియన్స్ లో ఎంతో ఆసక్తిని పెంచింది. కమల్ వ్యాఖ్యానంతోనే ప్రతి కథ ప్రేక్షకుల కళ్లముందుకు వస్తుంది. అయితే ఈ కథలన్నీ కూడా మనిషికీ.. మనసుకి సంబంధించినవి కావడం విశేషం. అనుభూతి ప్రధానంగా సాగుతాయి. ముగింపు అనేది ప్రేక్షకుల ఊహలకు వదిలి వేయబడుతుంది. ఈ తరహా ట్రీట్మెంట్ ఆ కాలం ప్రేక్షకులకు ఓకే .. ఈ జనరేషన్ కి మాత్రం కాస్త సాగదీసినట్టుగానే అనిపిస్తుంది. లొకేషన్స్ పరంగా .. ఫొటోగ్రఫీ వైపు నుంచి మాత్రం కొన్ని ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్