Sunday, November 24, 2024
Homeసినిమానిరాశపరిచే 'రఘు తాత'

నిరాశపరిచే ‘రఘు తాత’

ఈ మధ్య కాలంలో ఓటీటీ వైపు నుంచి ఎక్కువగా ఆసక్తిని రేకెత్తించిన సినిమాగా ‘రఘు తాత’ కనిపిస్తుంది. కీర్తి సురేశ్ .. రవీంద్ర విజయ్ .. భాస్కర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో విడుదలైంది. అయితే ఆ వైపు నుంచి ఆశించిన స్థాయిలో ఈ సినిమా కనెక్ట్ కాలేకపోయింది. ఈ నెల 13వ తేదీ నుంచి తెలుగులోను ఈ సినిమా ‘జీ 5’ ద్వారా అందుబాటులోకి వచ్చింది. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే హోంబలే బ్యానర్ పై ఈ సినిమా రూపొందడం విశేషం.

కీర్తి సురేశ్ కి ఉన్న క్రేజ్ కారణంగా, థియేటర్లలో ఈ సినిమా చూడని ప్రేక్షకులు ఓటీటీ పట్ల ఆసక్తిని చూపించారు. టైటిల్ ను బట్టి ఎమ్మెస్ భాస్కర్ ప్రధానమైన పాత్రను పోషించి ఉంటారని అంతా అనుకుంటారు. ఆయన మనవరాలిగా కీర్తి సురేశ్ పాత్ర  ప్రాధాన్యతను సంతరించుకుని ఉంటుందని భావిస్తారు. తాత – మనవరాలు కాంబినేషన్ లో ఎమోషన్స్ ఒక రేంజ్ లో ఉండొచ్చనే ఒక అంచనాకు వస్తారు. ఇక్కడే వాళ్ల అంచనాలకు దూరంగా ఈ కథ వెళుతుంది.

1960లలో .. ఒక మారుమూల గ్రామంలో నడిచే కథ ఇది. కథానాయికకు జీవితంపై ఒక ఆశ ఉంటుంది .. అవగాహన ఉంటుంది .. ఆశయం ఉంటుంది. వాటి కోసమే జీవించాలని అనుకుంటుంది. అయితే మరికొన్ని రోజులలో చనిపోనున్న తన తాతయ్య చివరి కోరికను తీర్చడం కోసం పెళ్లికి అంగీకరిస్తుంది.  తనని ఇష్టపడుతున్న వ్యక్తిని తన జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటుంది. అప్పుడే ఆమెకి ఒక నిజం తెలుస్తుంది. అదేమిటనేది కథ. ఇటు వినోదం పాళ్లు లేకపోవడం .. అటు సందేశం కూడా బలంగా కనిపించకపోవడం కారణంగా ఈ కంటెంట్ నిరాశపరుస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్