Saturday, January 18, 2025
Homeసినిమామెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం

మెగాస్టార్ చిరంజీవి స్వ‌యం కృషితో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలి చారు. తాజాగా ఆయనకు మ‌రో గౌర‌వం ద‌క్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది. మోస్ట్ క్రియేటివ్ యాక్టర్‌ ఇన్‌ ఇండియన్ సినిమాగా గిన్నిస్ బుక్‌లో చోటు దక్కడం విశేషం. ఈ విష‌యాన్ని తెలియ‌ జేస్తూ హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్‌లో ఈరోజు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ హీరో, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి అందుకున్నారు.

డాన్స్‌కి కేరాట్ అడ్ర‌స్‌గా నిలిచారు చిరంజీవి. ఆరు ప‌దుల వ‌య‌సులో కూడా అదే ఎనర్జీ, గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో 143 మూవీల్లో 537 పాట‌ల్లో 24000 స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కారు. చిరంజీవి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో ఎక్క‌డంలో మెగా అభిమా నుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్