Sunday, November 24, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల సస్పెండ్

ముగ్గురు సబ్ రిజిస్ట్రార్ల సస్పెండ్

ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసిన నకిలీ చలాన్ల కుంభకోణంపై దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లను ప్రభుత్వం నేడు సస్పెండ్ చేసింది.  కృష్ణా జిల్లా పటమట సబ్ రిజిస్ట్రార్ వి. వెంకటేశ్వర్లు, మండవల్లి సబ్ రిజిస్ట్రార్ సుబ్రహ్మణ్యంతో పాటు కడప సబ్‌ రిజిస్ట్రార్‌ సస్పెండ్ అయ్యారు.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈకుమ్భాకోనంలో ఇప్పటివరకు చలాన్ల స్కాంలో 9 మంది సబ్‌రిజిస్ట్రార్లపై వేటు పడింది.  సబ్‌ రిజిస్ట్రార్ల సస్పెన్షన్‌తో  పలు చోట్ల  రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇతర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా ప్రతి రిజిస్ట్రేషన్ ను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల కుంభకోణంపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల అత్యున్నత సమీక్ష నిర్వహించారు. అవినీతి నిరోధక శాఖ దాడులు చేస్తే తప్ప నకిలీ చలానాల వ్యవహారం తెలియలేదా? అసలు నకిలీ చలాన్లు ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఇంత పెద్ద స్థాయిలో తప్పులు జరిగినా ఎందుకు తెలియలేదని నిలదీశారు. ఈ అవినీతికి సంబంధింది అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను అడిగారు. దీనిపై అధికారులు వెంటనే కార్యాచరణకు దిగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్