Friday, November 22, 2024
HomeTrending Newsపంజ్ షిర్ కు అండగా తజికిస్తాన్

పంజ్ షిర్ కు అండగా తజికిస్తాన్

తజకిస్థాన్ తన విమానాలతో ఆయుధాలు, ఆహారం, ఆయిల్ తో పాటు మందులని పంజ్ షీర్ లో ఎయిర్ డ్రాప్ చేసింది. అమెరికా,నాటో దళాలు ఇంకా పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్ వదలి వెళ్లకముందే వేరే దేశం ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారాలలో తల దూర్చింది అంటే అది తజకిస్తాన్ మాత్రమె.
ఏమోమోలి రహమోన్ [Emomali Rahmon]- తజకిస్తాన్ అధ్యక్షుడు మాటల్లోనే …
తజకిస్తాన్ జాతి ప్రజల ప్రయోజనాలని కాపాడడానికి దుషాంబే ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మేము తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించబోము అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటున్న తజిక్ మరియు ఇతర జాతి ప్రజల హక్కులని కాలరాయడానికి కనుక తాలిబన్లు ప్రయత్నిస్తే తగిన ప్రతి చర్య తీసుకోవడానికి తజికిస్తాన్ వెనకాడబోదు.

భారత్ తజికిస్తాన్ లోని ఎయిర్ బేస్ ని యాక్టివేట్ చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇప్పటికే తాలిబన్ల కి అర్ధంఅయి ఉంటుంది. వేచి చూసే ధోరణిలో ఉన్న భారత ప్రభుత్వం ఏ మాత్రం తన ప్రయోజనాలకి భంగం కలిగినా తీసుకునే చర్య చాలా తీవ్రంగా ఉంటుంది అనే హెచ్చరిక ఇచ్చినట్లయింది.
ఒక వేళ తాలిబన్లు కనుక బల ప్రయోగం చేస్తే కనుక భారత్,తజకిస్థాన్ తో కలిసి పంజ్ షీర్ కి మద్దతుగా ఎయిర్ స్ట్రైక్ చేయవచ్చు. ఈ విషయంలో భారత్ వేనుకాడబోదు. తజకిస్థాన్ ఇప్పటికే తన ఉద్దేశ్యం ఏమిటో చెప్పేసింది. ఇక మిగిలిన మాజీ సోవియట్ రాష్ట్రాలు అయిన ఉబ్జెకిస్తాన్,తుర్క్మెనిస్తాన్ లు కూడా భారత్ తో కలిసి దాడులు చేయడానికి వెనకాడబోవు.
వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని మోడీతో ప్రత్యేక చానెల్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశ్యం ఇప్పుడు అర్ధంఅవుతున్నది. తనకి ప్రస్తుతానికి ఆఫ్ఘనిస్తాన్ లో ఎలాంటి ప్రయోజనాలు లేవు అని తెలుసుకున్నాక పుతిన్ పార్టీ మార్చేసి భారత్ తో చేతులు కలపడం వెనుక పరోక్షంగా నార్తన్ అలియన్స్ ని పునరుద్ధరించడం, వాళ్ళకి కావాల్సిన సహాయం చేయడానికే. ఇది పరోక్షంగా తాలిబన్ల కి హెచ్చరిక లాంటిది. ప్రస్తుతం ఒక్క పంజ్ షీర్ ప్రావిన్స్ ఒక్కటే తాలిబన్లకి లొంగలేదు కానీ మిగతా ఉత్తర ప్రావిన్స్ లు అన్నీ తాలిబన్ల అధీనంలో ఉన్నాయి.
కాబూల్ ఆత్మాహుతి దాడి మీద ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి ఇప్పుడు. ఇప్పట్లో తాలిబాన్ ప్రభుత్వాన్ని మెజారిటీ దేశాలు గుర్తించవు. మరో వైపు తాలిబన్ల ని వ్యతిరేకించి చిన్న చిన్న గ్రూపులు మళ్ళీ ఏకం అవుతున్నాయి. అంటే రోజూ ఎక్కడో ఒక చోట తాలిబన్లకి వ్యతిరేకంగా కాల్పులు జరుగుతూనే ఉంటాయి. మరో విశేషం ఏమిటంటే ఇస్లామిక్ స్టేట్ ఖోరోసాన్ తీవ్రవాదులు తాలిబన్లని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇంటిలిజెన్స్ సమాచారం. వీలయితే ఉత్తర ప్రావిన్స్ లు ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులని కూడా కలుపుకొని పోరాడాలని అనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇదే జరిగితే తాలిబన్ల కి తీవ్ర ప్రతిఘటనతో పాటు రెండవ తరం తాలిబన్ల నాయకులని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉంది.
ఇప్పుడు తాలిబన్లు కనుక భారత ప్రాజెక్టుల మీద దాడి చేసి వాటిని ధ్వంసం చేస్తే భారత్ తో పాటు రష్యా, తజికిస్తాన్,ఉబ్జెక్,తుర్క్మెనిస్తాన్ లని ఏక కాలంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆఫ్ఘనిస్తాన్ కి పార్లమెంట్ భవనం కట్టి వాళ్ళకి ఇచ్చిన భారతదేశం ముందు ఇప్పుడు ప్రధాన సమస్య ఒకటి ఎదుర్కోబోతున్నది. పార్లమెంట్ భవనం ని షురా[SHURA] కోసం వాడుకోవాలని భావిస్తున్నది. అరబిక్ లో షురా అంటే ఖురాన్ గురుంచి తెలుసుకోవడానికి ముస్లిమ్స్ అందరూ ఒకే చోట సమావేశం అయ్యే ప్రదేశం అన్న మాట. ఇది పాకిస్థాన్ ఆలోచన అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. భారత పన్ను చెల్లింపు దారుల డబ్బుతో కట్టిన ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనం అక్కడి మత పరమయిన వ్యవహారాలకి వాడుకోవడం మీద భారత్ చూస్తూ ఊరుకుంటే అంతకంటే పిచ్చితనం ఇంకోటి ఉండదు. మొదట్లో తడబడినా భారత అధికారులు చాలా వేగంగా పరిస్థితులని తమకి అనుకూలంగా మార్చుకొని స్ట్రాంగ్ పొజిషన్ లో వచ్చేశారు. ఇది శుభ పరిణామం.

ఇక కొందరు మిత్రులు ఇరాన్,టర్కీ,పాకిస్థాన్ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ లోకి వచ్చి తాలిబన్ల కి తమ యుద్ధ విమానాలతో సహాయం చేయలేవా అని అడుగుతున్నారు. ఇలాంటి ఆపారేషన్ల కి లాంగ్ రేంజ్ విమానాలు అయిన Su-30 లు లేదా F-15 లు లేదా B2 బాంబర్లు వాడాల్సి ఉంటుంది. ఇరాన్ దగ్గర లాంగ్ రేంజ్ యుద్ధ విమానాలు లేవు అదీ కాక రష్యా వెనక ఉంది కాబట్టి ఎట్టి పరిస్తితుల్లోనూ కల్పించుకొదు. ఇక చైనా ఎప్పటికీ తన ఎయిర్ ఫోర్స్ ని వాడదు. ఇక మిగిలింది పాకిస్థాన్ దగ్గర లాంగ్ రేంజ్ జెట్ ఫైటర్స్ లేవు. ఒక సారి మాప్ చూస్తే తెలిసిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర రాష్ట్రాలు పాకిస్థాన్ నుండి చాలా దూరంలో ఉన్నాయి. ఒక వేళ సహాయం చేయాలని అనుకుంటే మధ్యలోనే మిడ్ ఎయిర్ ఫ్యూయెల్ [Mid Air Fuel ] చేయాల్సి ఉంటుంది దానికోసం ఫ్యూయెల్ టాంక్ ర్స ని ఉపయోగించాలి ఇది చాలా ప్రమాదం వాటికి. ఇక భారత్ , తజకిస్థాన్ ల దగ్గర మాత్రమే Su-30 ఫైటర్స్ ఉన్నాయి కనుక దాడి చేసి తజకిస్తాన్ లోని ఎయిర్ బేస్ లకి తిరిగి వెనక్కి రాగలవు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్