ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ టిఎన్ఆర్ కరోనాతో మృత్యువాత పడ్డారు. కాచిగూడ లోని ప్రైవేటు ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ లో విభాగంలో చికిత్స పొందుతున్న టిఎన్నార్ కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. అయన అసలు పేరు తుమ్మల నరసింహ రెడ్డి.. ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ TNR అంటూ తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ చాలా పాపులర్ అయ్యారు. యూ ట్యూబ్ లో ఈయన ఇంటర్వ్యూలకు మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తుంటాయి. ఓ ప్రముఖ యూ ట్యూబ్ ఛానెల్ కోసం ఈయన పని చేస్తుంటారు. ఇండస్ట్రీలో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న మృధుస్వభావి టీఎన్ఆర్. నటనపై ఆసక్తి పెంచుకున్న టిఎన్నార్ ఇటీవల కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు కూడా పోషిస్తున్నారు.
రెండ్రోజులుగా అయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. టిఎన్నార్ ఆరోగ్యంపై పలువురు సినీ పెద్దలు ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడి పరిస్థితి వాకబు చేశారు. ఆదివారం మధ్యాహ్నం టిఎన్నార్ ఆరోగ్యం విషమంగా వున్నట్లు వార్తలు వచార్యి. సాయంత్రానికి వైద్యులు అందించిన సమాచారం ప్రకారం అయన డేంజర్ నుంచి బైట పడ్డారని, కోలుకుంటారని సన్నిహితులు వెల్లడించారు. కాని అర్ధరాత్రి దాటిన తర్వాత పరిస్థితి ఆరోగ్యం విషమించడంతో టిఎన్నార్ మృతి చెందారు.