Sunday, June 7, 2026
Homeస్పోర్ట్స్నాలుగో టెస్ట్: ఇండియా-191, ఇంగ్లాండ్ -53/3

నాలుగో టెస్ట్: ఇండియా-191, ఇంగ్లాండ్ -53/3

ఇంగ్లాండ్ తో ద ఓవల్ స్టేడియంలో జరుగుతోన్న నాలుగో టెస్ట్ లో కూడా ఇండియా పేవలమైన ఆటతీరు ప్రదర్శించింది. మొదటి ఇన్నింగ్స్ లో 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టాప్, మిడిలార్డర్ ఆటగాళ్ళు మరోసారి విఫలమయ్యారు. కెప్టెన్ విరాట్ కోహ్లి- 50, ఈ  మ్యాచ్ లో అవకాశం దక్కించుకున్న శార్దూల్ ఠాకూర్ -57 మాత్రమే రాణించారు.

ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ ఓక్స్ నాలుగు వికెట్లు సాధించాడు. ఆలీ రాబిన్సన్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఒవర్టన్, అండర్సన్ లకు చెరో వికెట్ దక్కింది.  మొదటి ఇన్నింగ్స్ లో 61.3 ఓవర్లు ఆడిన ఇండియా 191 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ కూడా మొదటి రెండు వికెట్లను ఆరు పరుగులలోపే కోల్పోయింది. తోలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ మూడు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేయగలిగింది. జస్ ప్రీత్ బుమ్రా కు రెండు వికెట్లు దక్కగా, మరో వికెట్ ఉమేష్ యాదవ్ కు లభించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular