పారాలింపిక్స్ లో భారత షూటర్ అవని లేఖరా తన ఖాతాలో రెండో పతకం జమ చేసుకుంది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3పి ఎస్.హెచ్.1 విభాగంలో కాంస్య పతకం గెల్చుకుంది. ఆగస్ట్ 30న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్.హెచ్.1 విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన అవని టోక్యో పారాలింపిక్స్ క్రీడల్లో మన దేశానికి తొలి స్వర్ణం అందించిన సంగతి విదితమే.
ఈ కాంస్యం గెలుపుతో ఒక ఒలింపిక్స్ లో రెండు పతకాలు గెల్చుకున్న మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణిగా అవని చరిత్ర పుటలక్కింది.
అవని గెల్చుకున్న ఈ కాంస్య పతకంతో ఇండియాకు మొత్తం 12 పతకాలు లభించినట్లయ్యింది. వీటిలో 2 స్వర్ణం, 6 రజతం, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. అవని లేఖరా తో పాటు జావెలిన్ త్రో ఎఫ్-62 విభాగంలో –సుమిత్ ఆంటిల్ ఇండియాకు రెండో స్వర్ణం అందించాడు. పతకాల పట్టికలో ఇండియా ప్రస్తుతం 36వ స్థానంలో కొనసాగుతోంది.