Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్పారాలింపిక్స్ : బ్యాడ్మింటన్ లో స్వర్ణం, కాంస్యం

పారాలింపిక్స్ : బ్యాడ్మింటన్ లో స్వర్ణం, కాంస్యం

పారాలింపిక్స్ లో ఇండియా నాలుగో స్వర్ణాన్ని సాధించింది. రెండు స్వర్ణాలు, ఒక్కో రజత, కాంస్య పతకంతో  నేడు మొత్తం నాలుగు పతకాలు గెల్చుకుంది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్.ఎల్-3 విభాగంలో ఇండియా ఆటగాడు ప్రమోద్ భగత్ స్వర్ణం గెల్చుకోగా, మనోజ్ సర్కార్ కాంస్యం సాధించాడు.

ప్రమోద్ భగత్ ఫైనల్ మ్యాచ్ లో గ్రేట్ బ్రిటన్ ఆటగాడు డానియెల్ బెతెల్ పై రెండు వరుస సెట్లలో 21-14, 21-17 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెల్చుకున్నాడు. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్ లో మనోజ్ సర్కార్ జపాన్ క్రీడాకారుడు డైసుకే ఫుజిహర ను ­22-20, 21-13 తేడాతో ఓడించాడు. మొదటి సెట్ హోరాహోరీ సాగినప్పటికీ రెండో సెట్ ను మనోజ్ అవలీలగా గెల్చుకున్నాడు.

బ్యాడ్మింటన్ ఎస్.ఎల్.3లో స్వర్ణం, కాంస్యం గెల్చుకోవడం ద్వారా ఒక విభాగంలో మనదేశానికే చెందిన ఇద్దరు ఆటగాళ్ళు పతకాలు సాధించడం ఇది మూడోసారి. అదీ ఈ టోక్యో పారాలింపిక్స్ లోనే కావడం విశేషం.

ఆగస్ట్ 31న జరిగిన హై జంప్ టి-63 పోటీలో మరియప్పన్ తంగవేలు-రజత, శరద్ కుమార్ -కాంస్య పతకాలు సాధించారు.

నేటి ఉదయం జరిగిన పి-4 మిక్సడ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్.హెచ్.-1 విభాగంలో మనీష్ నర్వాల్ స్వర్ణం, సింగ్ రాజ్ అధానా రజతం గెల్చుకున్నారు.

నేడు సాధించిన నాలుగు విజయాలతో ఇండియా పతకాల సంఖ్య 17కు చేరింది. వీటిలో 4 స్వర్ణం, 7 రజతం, 6 కాంస్య పతకాలు ఉన్నాయి పతకాల పట్టికలో ఇండియా ప్రస్తుతం 26వ స్థానానికి చేరుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్