తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రోగులు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఘటనపై జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి… వెంటనే నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గత రాత్రి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో జాప్యం వల్ల 11 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. ట్యాంకులో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోయి తగిన మోతాదులో రోగులకు వాయువు అందలేదు, దీంతో ఊపిరాడక కరోనా చికిత్స తీసుకుంటున్న రోగులు మృత్యువాత పడ్డారు. జిల్లా యంత్రాంగం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.
సంఘటన దురదృష్టకరమని, చెన్నై నుంచి రావాల్సిన టాంకర్ రావడం ఆలస్యమైదని, ఈలోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుండగానే 5 నిముషాలపాటు ప్రెషర్ తగ్గి ఈ ఘటన జరిగిందని జిల్లా కలెక్టర్ హరినారాయణ వెల్లడించారు.