బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 10వ రోజు పాదయాత్ర మోమిన్ పేట నుండి సదాశవపేట వరకు కొనసాగింది. సోమవారం ఉదయం నుండి రాత్రి పొద్దుపోయే వరకు ఒకవైపు వాన కురుస్తూనే ఉన్నా….లెక్క చేయకుండా బండి సంజయ్ వేలాది కార్యకర్తలు, ప్రజలతో కలిసి పాదయాత్ర కొనసాగించారు.
ఉదయం మోమిన్ పేట నుండి మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సంగప్పలతో కలిసి పాదయాత్ర నిర్వహించిన బండి సంజయ్ మధ్యాహ్నం 3 గంటలకు హరిత వనం సమీపంలో భోజన విరామం తీసుకున్నారు.
తిరిగి సాయంత్రం 4.30 గంటలకు తిరిగి ప్రారంభమైన పాదయాత్ర సరిగ్గా 5.15 గంటలకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి లతో కలిసి బండి సంజయ్ సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించారు. వందలాది మంది డప్పు చప్పుళ్లు, వేలాది మంది యువత, కార్యకర్తల కేరింతలు, నినాదాలు చేస్తుండగా……బండి సంజయ్ కు ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు.
అక్కడి నుండి వర్షంలోనే పాదయాత్ర కొనసాగించిన బండి సంజయ్ దారిలో చెరుకు రైతులను కలిసి వారి సమస్యలు విన్నారు. దారిలో ప్రజలను కలిశారు. సదాశివపేటలోకి ప్రవేశించగానే బోనాలతో మహిళలు బండి సంజయ్ యాత్ర కు స్వాగతం పలికారు. 100 కాగడాలతో బండి సంజయ్ వెంట నడుస్తూ సంఘీభావం తెలిపారు. బండి సంజయ్ పై పూల వర్షం కురిపిస్తూ కార్యకర్తలు. పట్టణంలోని గీత కార్మికులు పెద్ద ఎత్తున సంజయ్ ను కలిసి ఈత కమ్మలతో స్వాగతం పలికారు.