Monday, November 25, 2024
Homeసినిమాసెప్టెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా ‘హానీ ట్రాప్’

సెప్టెంబర్ 17 న ప్రపంచ వ్యాప్తంగా ‘హానీ ట్రాప్’

సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్  లో తెరకెక్కించే దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి. గతంలో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, వలస, గల్ఫ్ లాంటి సందేశాత్మక సినిమా నిర్మించి విడుదల చేసారు. ఇప్పుడు ‘హనీ ట్రాప్’ అనే సమకాలీన కథతో సెప్టెంబర్ 17న విడుదల చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా విడుదల తేది తెలియజేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. రిషి, శిల్పనాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటించారు. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకం పై వివి వామనరావు ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ప్రవీణ్ ఇమ్మడి సంగీతాన్ని అందించారు.

దర్శకుడు పి.సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నేను చేసిన గత సినిమాల కంటే ఎలా డిఫరెంట్ అంటే నేను ఎప్పుడూ నా సొంత కథలతోనే సినిమా చేసేవాణ్ణి కానీ.. మా నిర్మాత వామనరావు గారు కథ చెప్పడం జరిగింది. కథ విన్న వెంటనే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నేనెప్పుడూ కాంటెంపరరీ కథలు చేస్తుంటాను. మీరు కూడా అదే కోవలో సబ్జెక్ట్ ఉన్నమంచి కథ చెప్పారు అన్నాను. తను చెప్పిన కథ డెవలప్ చేసి సినిమా చెయ్యడం జరిగింది. వామనరావు గారు చాలా సెన్సిబుల్ రైటర్. నంది అవార్డు పొందిన నాటకాలను రచించిన  గొప్ప రచయిత అయిన తను చాలా టేస్ట్ ఉన్న నిర్మాత…తనతో వర్క్ చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. సొంతవూరు, గంగపుత్రులు చేస్తున్నప్పటి నుండి పి.యల్.కె రెడ్డి గారితో మా ఇద్దరికి అనుబంధం ఉంది. ఇంత మంచి సినిమా చేసే అవకాశం కల్పించిన తనకు నా ధన్యవాదాలు .ఇందులో నటీనటులందరూ చాలా చక్కగా నటించారు. మా ‘గల్ఫ్’ సినిమాలో నటించిన డింపుల్ బాలీవుడ్ కు ఎలా వెళ్ళిందో.. అలాగే ఈ చిత్రంలో నటించిన వారందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈనెల 17న విడుదల అవుతున్న మా ‘హానీ ట్రాప్’ను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్