అశ్విన్ కాకుమాను కథానాయకుడిగా డెబ్యూ డైరెక్టర్ మోహన్ గోవింద్ రూపొందిస్తోన్న హారర్ థ్రిల్లర్ ‘పిజ్జా 3 ది మమ్మీ’. సి.వి.కుమార్ నిర్మాణంలో రూపొంది ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన హారర్ థ్రిల్లర్ పిజ్జా. విజయ్ సేతుపతి కెరీర్ ప్రారంభంలో ఆయనకు నటుడిగా బ్రేక్ తెచ్చిన చిత్రాల్లో ఇదొకటి. ఇప్పుడు మరోసారి నిర్మాత సి.వి.కుమార్ అలాంటి హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ చిత్రమే ‘పిజ్జా 3’. ‘డైరీ’ ఫేమ్ పవిత్రా మారిముత్తు హీరోయిన్‌గా నటించింది.
గ్లింప్స్ విడుదల చేయడం ద్వారా సినిమా ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ మొదలు పెట్టింది. ప్రతి సీన్, దానికి సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటుంటే హారర్ థ్రిల్లర్ ఎలా ఉండాలని సగటు ప్రేక్షకుడు భావిస్తాడో దాన్ని మించేలా ఉంది. గ్లింప్స్ చూసిన తర్వాత ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతాయనడంలో సందేహం లేదు.
గౌరవ్ నారాయణన్, అభిషేక్ శంకర్, కాళి వెంకట్, అనుపమ కుమార్, రవీనా దాహ, కురైసి, యోగి, సుభిక్ష ఇతర కీలక పాత్రల్లో నటించారు. పిజ్జా-2కు సీక్వెల్‌గా పిజ్జా-3ని ఒరిజినల్ స్క్రిప్టుతో రూపొందించారు. అశ్విన్ హేమంత్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది.