Friday, September 20, 2024
HomeTrending Newsతాలిబాన్ తో చర్చల ప్రసక్తే లేదు

తాలిబాన్ తో చర్చల ప్రసక్తే లేదు

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చాక సరిహద్దు దేశాలు అప్రమత్తం అవుతున్నాయి. తాలిబాన్ ఏలుబడిలో ఉగ్రవాదుల అరాచకాలు పెరుగుతాయని ముందు జాగ్రత్తగా సరిహద్దు నగరాల్లో అదనపు బలగాలు మోహరిస్తున్నాయి. తాలిబాన్ తో తొలి నుంచి వైరం ఉన్న రష్యా కొద్ది రోజులుగా ఆఫ్ఘన్ వ్యవహారాలతో అంటీ ముట్టనట్టుగా ఉంటోంది. అయితే ఏ క్షణంలో ముప్పు వాటిల్లినా ఎదుర్కునేందుకు సమయాత్తమైంది. ఇందులో భాగంగా ఆఫ్ఘన్ ఉత్తర సరిహద్దులోని తజికిస్తాన్ దేశంలో ఉన్న రష్యా మిలిటరీ స్థావరాలకు మరిన్ని బలగాలను పంపింది. అలాగే తజికిస్తాన్లోని రష్యా ఎయిర్ బేస్ ను మరింత పటిష్టం చేస్తున్నారు.

తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపే ఆలోచన లేదని రష్యా ప్రకటించింది. రష్యా మిలిటరీ కాని రష్యా ప్రభుత్వం తరపున కాని తాలిబాన్ తో సంప్రదింపులు జరిపేది లేదని దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయ వర్గాలు తేల్చి చెప్పాయి. తాలిబాన్ల గత పాలనలో మానవ అక్రమ రవాణ, మాదక ద్రవ్యాల లావాదేవీలు, ఇతర దేశాల పౌరులు, మతాల వారిని వేధించటం చూశామని రష్యా పేర్కొంది.

ఆఫ్ఘన్ కేంద్రంగా టెర్రరిస్టు కార్యకలాపాలతో అనేక దేశాలు అవస్థలు పడ్డాయని భారత్ లో రష్యా రాయబారి నికోలాయ్ కుదశేవ్ గుర్తు చేశారు. ఆఫ్ఘన్ లో శాంతి సుస్థిరత నెలకొనేందుకు ఇండియాతో కలిసి రష్యా పనిచేస్తుందని నికోలాయ్ కుదశేవ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో బారత్ తో కలిసి రష్యా పనిచేస్తుందని, రెండు దేశాల మైత్రి దశాబ్దాల కాలం నాటిదని, ఆసియ ఖండంలో ఉగ్రవాద నిర్మూలనలో రష్యా భారత దేశానికి అండగా ఉంటుందని నికోలాయ్ కుదశేవ్ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్