కరోనా అదుపులో ఉందని, అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ కంపెనీలు తెరవాలన్నారు. ఐటీ కంపెనీల మీద చాలా రంగాలు ఆధారపడి ఉన్నాయని.. లక్షలాది మందికి ఉపాధి దొరకాలన్నారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని.. కంపెనీలు ఓపెన్ చేయడానికి ఇదే సరైన సమయమన్నారు. ఇప్పటివరకు 2 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చామని తెలిపారు. జీహెచ్‌ఎంసీలో 100 శాతం వ్యాక్సిన్‌లు ఇచ్చామన్నారు. కొత్త వేరియంట్ వస్తే తప్ప థర్డ్ వేవ్ రాదని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి రోజు 3 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేస్తామని చెప్పారు. పిల్లల్ని స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు వెనకాడొద్దని సూచించారు. మార్చి వరకు థర్డ్ వేవ్ వచ్చే చాన్సులు లేవని.. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని వివరించారు.