తెలంగాణా రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఈ రోజు (మే 12) ఉదయం 10 గంటలకు మొదలైన లాక్ డౌన్ 10 రోజులపాటు అమల్లో వుంటుంది. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ 4 గంటలపాటు నిత్యావసరాలు సమకూర్చుకునే వెసులుబాటు కల్పించారు. వ్యవసాయం, వైద్యం, విద్యుత్, మీడియా రంగాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలు ౩౩ శాతం సిబ్బందితో పనిచేస్తాయి.
తమకు కావాల్సిన నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటలకే పెద్దఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చారు. సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు కిక్కిరిసిపోయాయి. మరికొంతమంది సొంత ఊళ్లకు వెళ్లేందుకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేరుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలతో సరైన రవాణా మార్గాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ నగరంలో సిటి బస్సులు, మెట్రో సేవలు కుడా నిర్ణీత సమయంలోనే పని చేస్తున్నాయి. టికా కేంద్రాల వద్ద, కోవిడ్ పరిక్షా కేంద్రాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు.