Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్రవిశాస్త్రి వారసుడిగా కుంబ్లే!

రవిశాస్త్రి వారసుడిగా కుంబ్లే!

భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే పేరును బిసిసిఐ పరిశీలిస్తోంది. రవిశాస్త్రి వారసుడిగా కుంబ్లే సరైన ఎంపిక అవుతుందని బిసిసిఐ తో పాటు క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

క్రికెట్ టీమిండియా సారధి విరాట్ కోహ్లీ బాటలోనే కోచ్ రవిశాస్త్రి కూడా ఐసిసి టి-20 వరల్డ్ కప్ తరువాత కోచ్ బాధ్యతలలో కొనసాగాలేననని  వెల్లడించాడు. అయన పదవీ కాలం కూడా  టి-20 వరల్డ్ కప్ వరకూ ఉంది. ఆ తరువాత తాను కోచ్ గా ఉండలేనని బిసిసిఐకు తెలియజేశాడు.

టీమిండియాకు మార్గదర్శకుడిగా తాను అనుకున్నవన్నీ సాధించానని, ఇక కోచ్ పదవి చాలని గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి వెల్లడించాడు. టెస్ట్ క్రికెట్ లో ఇండియాను నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టానని, ఆస్ట్రేలియాను వారి గడ్డమీదే ఓడించి సిరీస్ ను గెల్చుకున్నామని, కోవిడ్ సంక్షోభ సమయంలో ఇంగ్లాండ్ సీరిస్ లో ఆధిక్యం సాధించామని, ఓవల్, లార్డ్స్ టెస్టుల్లో విజయం అసమానమైందని రవి శాస్త్రి సంతోషం వ్యక్తం చేశాడు. దాదాపు అన్ని దేశాలను వారి సొంత గడ్డపై టెస్ట్ క్రికెట్ లో ఓడించామని, ఈ విషయమై తాను గర్వపడుతున్నట్లు శాస్త్రి చెప్పాడు. టి-20 వరల్డ్ కప్ గెలిస్తే అంతకంటే తనకు కావాల్సింది ఏమీ ఉండబోదని స్పష్టం చేశాడు.

2017 జూలై 13న టీమిండియా కోచ్ గా రవిశాస్త్రిని బిసిసిఐ ఎంపిక చేసింది. 2019 ఆగస్టు 16 న మరోసారి అయన పదవీ కాలాన్ని బిసిసిఐ పొడిగించింది. ఈ పదవీకాలం టి-20 వరల్డ్ కప్ తో ముగియనుంది.

రవి శాస్త్రి స్థానంలో అనిల్ కుంబ్లే తో పాటు హైదరాబాదీ సొగసరి బాట్స్ మాన్ వివిఎస్ లక్షణ్ పేరును కూడా బిసిసిఐ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్