Friday, November 22, 2024
HomeTrending Newsఆంక్షలపై మహిళల నిరసనలు

ఆంక్షలపై మహిళల నిరసనలు

ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. తాలిబాన్ ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ రద్దు చేయటం విమర్శలకు దారి తీస్తోంది. తాలిబాన్ల నిర్ణయానికి వ్యతిరేకంగా కాబూల్ లో మహిళలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. తాలిబాన్ ముఖ్య కార్యాలయం ముందు నిరసనకు దిగారు. మహిళా సంక్షేమ శాఖను పునరుద్దరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మహిళలు, పురుషులు కార్యాలయాల్లో కలిసి పనిచేయటం కుదరదని ఇటీవల తాలిబాన్ ప్రకటించింది. అప్పటి నుంచి ఆఫ్ఘన్ లోని హక్కుల కార్యకర్తలు నిరసనలు చేపడుతున్నా తాలిబాన్ పట్టించుకోవటం లేదు. విద్య, ఉద్యోగాలు, పని ప్రాంతాల్లో సమానత్వం కల్పించాలని మహిళలు కోరుతున్నారు.

అటు బాలికల విద్యాలయాల మూసివేత కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు బాలికల విద్యపై నిర్భందం లేదన్న తాలిబన్లు క్రమంగా బాలికల విద్యాలయాల్ని మూసివేస్తున్నారు. తాలిబాన్ నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆఫ్ఘన్ సమాజాన్ని అనాగరికం వైపు తాలిబన్లు తోసేస్తున్నారని విమర్శించింది. తాలిబాన్ల విధానాలతో బాలికలు విద్యాబుద్దులకు దూరమైతే సమాజంలో విపరిణామాలకు దారితీస్తుందని UNESCO,UNICEF హెచ్చరించాయి.

2001లో తాలిబన్లు గద్దె దిగే నాటికి స్త్రీల అక్షరాస్యత కేవలం 17 శాతం ఉండగా 2018 నాటికి 30 శాతానికి చేరుకుంది. ప్రాథమిక విద్యలో బాలికల వాటా సున్నా శాతం నుంచి 5 శాతానికి చేరుకుంది. ఉన్నత విద్య అభ్యసిస్తున్న బాలికల సంఖ్య 2001 లో ఇదు వేలు మాత్రమె ఉండగా 2018 నాటికి 90 వేల మందికి చేరుకుందని ఐక్యరాజ్యసమితి నివేదికలో వెల్లడైంది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్